TWO PANCARDS 2022
Pancard Updates : రెండు పాన్కార్డులున్నా యా..వెంటనే సరెండర్ చేయకపోతే కలిగే ఇబ్బందుల వివరాలు.
పాన్‌కార్డ్ అనేది అతి ముఖ్యమైన డాక్యుమంట్. బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేయాలన్నా..లావాదేవీలకు అవసరం. ఇప్పటికే పాన్‌కార్డును ఆధార్ సహా చాలా చోట్ల అనుసంధానం తప్పనిసరిగా మారింది. ఇంకా కొన్ని అప్‌డేట్స్ మీ కోసం.
పాన్‌కార్డును ఆధార్ కార్డుతో సహా చాలా చోట్ల అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది. లేకపోతే మీ పాన్‌కార్డు పని చేయదు. అదే సమయంలో పాన్‌కార్డుకు సంబంధించి తప్పులు చేస్తే వెంటనే మార్చుకోవడం మంచిది. లేకపోతే 10 వేల రూపాయల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌కార్డుకు సంబంధించిన ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం.
మీ దగ్గర రెండు పాన్‌కార్డులుంటే ఈ సూచనలు తప్పకుండా చదవాల్సిందే. ముందుగా పాన్‌కార్డుపై ఇచ్చిన పది అంకెల పాన్ నెంబర్‌ను చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. ఇందులో ఏ విధమైన స్పెల్లింగ్ తప్పులు లేదా నెంబర్ అటూ ఇటూ కావడం జరిగితే భారీ జరిమానా తప్పదు. దాంతోపాటు రెండు పాన్‌కార్డులున్నా కూడా భారీ పెనాల్టీ తప్పదు. రెండు పాన్‌కార్డులుంటే మీ బ్యాంక్ ఎక్కౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అందుకే ఒకవేళ మీ వద్ద రెండు పాన్‌కార్డులుంటే ఒకటి సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కంటాక్స్ శాఖ చట్టం 1961 సెక్షన్ 272 బిలో ఈ విషయం గురించి వివరణ ఉంది.
పాన్‌కార్డ్ సరెండర్ చేసే ప్రక్రియ చాలా సులభం. దీనికి సంబంధించిన దరఖాస్తును ఇన్‌కంటాక్స్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు కోసం..Request For New PAN Card Or/ And Changes Or Correction in PAN Data లింక్ పై క్లిక్ చేయాలి. తరువాత దరఖాస్తు నింపి..NSDL కార్యాలయంలో సమర్పించాలి. రెండవ పాన్‌కార్డును కూడా వెంట తీసుకెళ్లాలి. లేదా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కూడా చేయవచ్చు.
COMMENTS