TS SET 2022
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ – 2022 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం టీఎస్ సెట్-2022 పరీక్ష వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ యేట టీఎస్ సెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మొత్తం 29 సబ్జెక్టుల్లో ఆన్లైన్ విధానంలో సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
టీఎస్ సెట్-2022కు దరఖాస్తు చేసుకోవాలంటే.. సంబంధి సబ్జెక్టులోఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంటెక్.. లలో ఏదైనా డిగ్రీలో కనీసం 55 శాతం మార్కుతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జనవరి 20, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో ఓసీ కేటగిరీ అభ్యర్ధులు రూ.2000, బీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/వీహెచ్/హెచ్ఐ/ఓహెచ్/ట్రాన్స్జెండర్ అభ్యర్దులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
రూ.1500 ఆలస్య రుసుముతో జవనరి 25 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో జవనరి 31 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 6, 7 తేదీల్లో అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. పరీక్ష 2023 మార్చిలో ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
సబ్జెక్టులు ఇవే..
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS