TRAIN TICKET 2023
మీరు రైలు టికెట్టును వేరొకరికి ట్రాన్ఫర్ చేయొచ్చు తెలుసా..? ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..
IRCTC News: ప్రస్తుత కాలంలో దూర ప్రయాణాలకు రైలునే మనలో చాలా మంది ప్రధానంగా ప్రిఫర్ చేస్తుంటాం. టికెట్లు దొరకవని చాలా సార్లు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటాం. అయితే చివరికి అనుకోని కారణాల వల్ల ప్రయాణాలను రద్దు చేసుకోవలసి రావటం, మనకు బదులు వేరొకరిని పంపించటం లాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్ఫంలో మీ పేరున ఉన్న టిక్కెట్టును వేరొకరికి ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..
రద్దు చేసుకోవాల్సి వస్తే..
మీరు రైలు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేసుకుని.. సమయం దగ్గర పడుతుంది. ఇంతలో అనుకోని కారణాల వల్ల కానీ, లేదా వెళ్లాల్సిన అవరం లేదనిపించినప్పుడు ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి రావచ్చు. లేదా చేయవలసిన ప్రయాణం వాయిదా పడవచ్చు. లేదా మీకు బదులు ఇంట్లో వేరొకరు వెళ్లాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భంలో టికెట్ రద్దు చేసుకోవటం సర్వ సాధారణం. ఈ ప్రక్రియ చాలా మందికి ఇప్పటికే తెలుసు. అయితే అదే టిక్కెట్ తో మీ కుటుంబంలో మరొకరు ప్రయాణించొచ్చని చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. ఈ సౌలభ్యం చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మందికి తెలియదు.
24 గంటల ముందుగా..
IRCTC రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లను కొనుగోలుచేసిన వారు.. తన ప్రయాణ టిక్కెట్ ను వేరొకరికి బదిలీ చేయవచ్చు. దీనికోసం ప్రయాణ సమయానికి కనీసం 24 గంటల ముందు టిక్కెట్ తీసుకుని రైల్వే టికెట్ బుక్కిగ్ కార్యాలయానికి వెళ్లి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రైల్వే సిబ్బంది వినతి మేరకు టిక్కెట్ ను మీరు కోరిన వ్యక్తి పేరు మీదకు బదలాయింటి కొత్త టికెట్ అందిస్తారు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉంటాయనే విషయం రైల్వే ఉద్యోగులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.
టిక్కెట్ మార్చేందుకు ఏమేమి తీసుకెళ్లాలి..
రైలు టిక్కెట్ బదిలీ కోసం సంప్రదించేందుకు వెళ్లే సమయంలో కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది. మెుదటగా తీసుకున్న టికెట్ కాపీ, వ్యక్తిగత ధృవీకరణకోసం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డుతో రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించాలి. ఎవరి పేరు మీదకు టిక్కెట్ ను మార్చాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని కూడా వెంట తీసుకెళ్లాలి. అయితే ఇలా టిక్కెట్టును కేవలం ఒక్కసారి మాత్రమే బదిలీ చేసేందుకు అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు కూడా ఇలా ట్రాన్ఫర్ చేయెుచ్చా అనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అలాంటి సందర్భం ఎదురైతే రైల్వే రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించటం ఉత్తమం.
COMMENTS