To get back the money sent to others by mistake through PhonePe and Google Pay..
PhonePe, Google Pay ద్వారా పొరపాటున వేరేవాళ్లకు పంపిన డబ్బులు వెనక్కు తెప్పించాలంటే..
పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే.. వీటి గురించి తెలియని వారు దాదాపుగా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మూరు మూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకూ నగదు రహిత లావీదేవీలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
దీన్ని అనుసరించే చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌ల వరకూ అన్నింట్లోనూ ఎక్కువగా డిజిటల్ చెల్లింపులే (Digital payments) జరుగుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రూపాయి నుంచి లక్ష వరకూ PhonePe, Google Pay ద్వారా పంపించే అవకాశం వచ్చింది. అయితే ఇందులో అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ఒకరికి పంపాల్సిన నగదును మరొకరికి పంపుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తెగ గాబరాపడిపోతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్‌బీఐ (RBI) చర్యలు తీసుకుంది.
యూపీఐ (Unified Payments Interface) ద్వారా జరిపే నగదు లావాదేవీల్లో ఎలాంటి మోసాలు జరగవు. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి నగదు వెళ్లకపోయినా.. రోజుల వ్యవధిలోనే మళ్లీ పంపినవారికి రీఫండ్ అవుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఒక స్కానర్ కోడ్‌కు బదులు.. ఇంకోటి స్కాన్ చేయడం, ఒకరి యూపీఐకి బదులుగా.. ఇంకో యూపీఐకి నగదు పంపుతుంటారు. అప్పుడు నష్టపోయిన వ్యక్తి నగదును తిరిగి పొందేలా ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది.
అయితే ఇందుకోసం నష్టపోయిన వ్యక్తి, ముందుగా లావాదేవీలు జరిపిన.. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వ్యవస్థలకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ (Customer service) ద్వారా సాయం తీసుకోవచ్చు. ఇలా చేస్తే దాదాపుగా సమస్య పరిష్కారం అవుతుంది. అయితే అప్పటికీ నగదు రీఫండ్ (Cash refund) కాకపోయినా భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఆర్‌బీఐ.. అంబుడ్స్‌మన్ (Ombudsman) అనే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర మార్గాల ద్వారా జరిపే లావాదేవీల్లో సమస్య ఎదరురైన సందర్భంలో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
COMMENTS