TMC RECRUITMENT 2022
పదో తరగతి/డిప్లొమా అర్హతతో టాటా మెమోరియల్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53 వేల జీతం..
ముంబాయిలోని టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన హోమీ భాభా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ దేశ వ్యాప్తంగా ఉన్న పలు క్యాన్సర్ ఆసుపత్రుల్లో.. 405 లోయర్ డివిజన్ క్లర్క్, అటెండెంట్, నర్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఆంకాలజీ నర్సింగ్‌లో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ డిప్లొమా, బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయసు తప్పనిసరిగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 10, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ కేటగిరీకి చెందిన వారు అప్లికేషన్ ఫీజుగా రూ.300లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు.
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపకి ఉంటుంది.
పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.53,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 100 మర్కులకు 3 గంటల వ్యవధిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ ‘ఏ’లో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయాలి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పార్ట్ ‘బి’లో 50 మర్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. స్కిల్ టెస్ట్ 50 మార్కులకు 45 నిముషాల్లో ఉంటుంది.
ఖాళీల వివరాలు..
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 18
అటెండెంట్ పోస్టులు: 20
ట్రేడ్ హెల్పర్ పోస్టులు: 70
నర్సు-ఎ పోస్టులు: 212
నర్స్-బి పోస్టులు: 30
నర్స్-సి పోస్టులు: 55
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS