The doctor's sloppy writing can be fixed with Google!
డాక్టర్ గారు రాసిన గజిబిజి రాతకు గూగుల్ పరిష్కారం !
డాక్టర్ రాసిన మందుల చీటీలో రాత అర్థం కావటం లేదా ? మందులేంటో తెలియక బుర్ర గోక్కుంటున్నారా ? ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు .
డాక్టర్ రాసిన మందుల చీటీలో రాత అర్థం కావటం లేదా ? మందులేంటో తెలియక బుర్ర గోక్కుంటున్నారా ? ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు . డాక్టర్ల గజిబిజి చేతిరాతను విశ్లేషించి , స్పష్టంగా చూపించే ఫీచర్ను గూగుల్ త్వరలో ప్రవేశ పెట్టనుంది . మనదేశంలో ఏటా నిర్వహించే ' గూగుల్ ఫర్ ఇండియా ' కార్యక్రమంలో దీంతో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను ప్రకటించింది . డాక్టర్ల చేతి రాతను అర్థం చేసుకోవటానికి గూగుల్ తీసుకురానున్న కొత్త ఫీచర్ కృత్రిమ మేధ , మెషిన్ లెర్నింగ్ సాయంతో పనిచేస్తుంది . దీన్ని గూగుల్ లెన్స్ యాప్తో వాడుకోవచ్చు . మందుల చీటీని స్మార్ట్ఫోన్తో ఫొటో తీసి , ఫొటో లైబ్రరీకి అప్లోడ్ చేస్తే చాలు . వెంటనే గూగుల్ లెన్స్ యాప్ దాన్ని గుర్తించి , డాక్టర్ల రాతను విశ్లేషిస్తుంది . మందుల వివరాలను స్పష్టంగా చూపిస్తుంది . ఈ ఫీచర్ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు .
మందుల చీటీలను బాగా అర్థం చేసుకోవటానికి మందుల దుకాణాల వారితో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది . రెండు మూడు వారాల్లో దీనిపై స్పష్టత రావొచ్చు . * గూగుల్ పే యాప్ను మరింత సురక్షితంగా మార్చే ఫీచర్లనూ జోడించనున్నట్టు గూగుల్ తెలిపింది . చెల్లింపుల్లో ఏవైనా అవకతవకలు , అక్రమాలున్నట్టు ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థ గుర్తించినట్టయితే వెంటనే హెచ్చరించే ఏర్పాటు చేయనుంది . ధ్రువీకృత డిజిటల్ పత్రాలను తేలికగా యాక్సెస్ చేసుకోవటానికి గూగుల్ సంస్థ నేషనల్ ఇగవర్నెన్స్ డివిజన్ ( ఎస్ఈజీడీ ) తో కలిసి పనిచేస్తోంది కూడా . దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఫైల్స్ యాప్ నుంచి నేరుగా ఆయా పత్రాలను చూసుకోవచ్చు . ఇమేజ్ , టెక్స్ట్ సమాచారాలను రెండింటినీ ఒకేసారి శోధించటానికి మల్టీసెర్చ్ ఫీచర్నూ ప్రవేశపెట్టనున్నారు . ఇది మనదేశంలో ఇంగ్లిష్ అందుబాటులో ఉంది . వచ్చే సంవత్సరంలో హిందీలో ఆరంభించి , తర్వాత ఇతర భాషలకు విస్తరించనున్నారు .
ఈ యూట్యూబ్ సైతం కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను ప్రకటించింది . ఇందులో ఒకటి కోర్సెస్ . ఇది పాఠ్య బోధన కోసం ఉద్దేశించిన ఫీచర్ . సబ్ స్క్రిప్షన్ మోడల్లో దీన్ని ఇప్పటికే పరీక్షిస్తోంది . కొంతమంది భాగస్వాములు , కంటెంట్ క్రియేటర్లతో కలిసి వచ్చే ఏడాది ఈ ఫీచర్ను ఆరంభించనుంది . దీంతో కంటెంట్ క్రియేటర్లు పాఠ్య బోధన వీడియోలతో డబ్బు సంపాదించుకోవచ్చు .
COMMENTS