The article Pooja And Coconut: If the coconut beat before God rots, is it a bad omen?
దేవుడి ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే. అశుభానికి సంకేతమా వివరణ.
దేవాలయానికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొడతారు. గుడికి వెళ్లే ప్రతిఒక్కరూ దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటారు. వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
కొబ్బరికాయల్లో ఉండే నీరు చాలా పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. అందుకే కొబ్బరికాయలను దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారు. ఇక దేవుడి ముందు మనలోని అహం, ఈర్ష్య, అసూయ, కోపం వంటి గుణాలు మటుమాయం కావాలని కొబ్బరికాయలను కొడుతుంటాం.
అంతేకాదు కొబ్బరికాయలకు ఉండే మూడు కళ్లను పరమేశ్వరుడి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయను కొట్టేముందు దానని కడుగుతుంటారు. ఇక కొబ్బరికాయ పెట్ట కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలని చెబుతుంటారు. కొందరు టెంకాయను కొట్టాక వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతుంటారు. కానీ అలా చేయకూడదు. వెంటనే కొబ్బరికాను వీడదీసి అందులో ఉన్న నీటిని వేరే పాత్రలో పోయాలి. ఆ రెండు చెక్కలను దేవుడి ముందు నైవద్యంగా పెట్టాలి.
ఇక చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోయినట్లయితే తమకు అశుభం జరుగుతుందని భావిస్తుంటారు. కానీ అందులో నిజం లేదు అది అపనమ్మకం మాత్రమే. ఒకవేళ కొబ్బరికాయ కుళ్లిపోయినట్లయితే మళ్లీ స్నానం చేసి వచ్చి ఇంకో కొబ్బరికాయను కొట్టాలి. వాహనాలకు పూజచేసే సమయంలో కొబ్బరికాయను కొట్టినా కూడా ఇదే నియమం వర్తిస్తుంది. వాహనాన్ని మళ్లీ శుభ్రంగా కడిగి, భక్తులు తాము కూడా స్నానం చేసి మళ్లీ కొత్త కొబ్బరికాయను కొట్టాలి.
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వచ్చినట్లయితే కోరిన కోరికలు తీరుతాయట. కొత్త వివాహం చేసుకున్న దంపతులకు పువ్వు వస్తే వారికి సంతానం తొందరగా కలుగుతుందని నమ్ముతారు. ఒక కొబ్బరికాయ నిలువుగా పగిలినట్లయితే వారి ఇంట్లో త్వరగా సంతానం కలుగుతుందని చెబుతుంటారు.
COMMENTS