Taxes: How much cash is permissible to keep at home?
మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? పరిమితికి మించి ఉంటే జరిమానా విధిస్తారా?.. నిబంధనలు ఏమిటి?
సాధారణంగా అందరి ఇళ్లలో డబ్బులు ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఎక్కువగా ఉంటే జరిమానాలు విధిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చన్న ప్రశ్న సామాన్యులకు వస్తుంటుంది. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచాలనే దానిపై ఖచ్చితమైన పరిమితి లేదు. మీరు అపరిమిత నగదును ఉంచుకోవచ్చు . కానీ ఒకే ఒక షరతు ఉంది. అధిక మొత్తంలో మీ ఇంట్లో నగదు ఉన్నట్లయితే మొత్తం ఆదాయ మూలాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ నగదు ఎలా సంపాదించారు అనే వివరాలను సమర్పించాలి.
ఈ నగదు ఆదాయం పన్నుకు అర్హమైనట్లయితే మీరు దానిపై కూడా పన్ను చెల్లించాలి. మీకు ఆదాయ వనరు, దాని వివరాలు ఉంటే మీరు ఇంట్లో ఎంత మొత్తాన్ని అయినా ఉంచవచ్చు. ఎలాంటి పరిమితి లేదని గుర్తించుకోవాలి. అలాగే, మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఎలాంటి చర్యలను ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి మీకు సరైన పత్రాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదని గమనించాలి.
ఆదాయపు పన్ను శాఖ మీ సమాధానంతో సంతృప్తి చెందకపోతే, ఆదాయ వనరు ఏమిటి, ఇంత ఆదాయం ఎక్కడ నుండి వచ్చింది అనేదానికి మీరు సమాధానం ఐటీ అధికారులకు ఇవ్వాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ పత్రాల్లో తప్పులుంటే పెనాల్టీ చెల్లించుకోక తప్పదు. అంతే కాదు కొన్ని సమయాల్లో కేసులు కూడా నమోదు అవుతాయి.
పత్రాలు సక్రమంగా ఉండకుండా అధికారులు సంతృప్తి చెందక నేరం రుజువైతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు స్థూల ఆదాయంపై 137 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు బ్యాంకులో ఏటా 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తుంటే మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డును చూపించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.
మీరు ఒక సంవత్సరంలో కోటి రూపాయల లావాదేవీ చేస్తే, మీరు 2% టీడీఎస్ చెల్లించాలి. మీరు ఒక రోజులో 50 వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని బ్యాంకు నుండి విత్‌డ్రా చేస్తే మీరు మీ పాన్ కార్డ్ చూపించాలి. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని నేరుగా నగదు రూపంలో కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన ఆదాయ సమాచారాన్ని అందించాలి. 2 లక్షలకు పైబడిన కొనుగోళ్లను నగదు రూపంలో మాత్రమే చేయడం సాధ్యం కాదు.
COMMENTS