SOLAR ROOFTOP YOJANA 2022
రూఫ్‌టాప్ సోలార్ యోజన స్కీమ్‌ను పొడిగించిన కేంద్రం.. రూ.43 వేలకు పైగా సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తీసుకువచ్చింది. ప్రభుత్వం రూఫ్‌టాప్ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వారికి మంచి అవకాశం. ఈ పథకాన్ని మార్చి 31, 2026 వరకు పొడిగించించింది కేంద్రం.
పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను అమర్చడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించవద్దని వినియోగదారులను కోరింది. మీరు కూడా మీ కరెంటు బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మోడీ ప్రభుత్వం మీ కోసం ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో అప్లై చేయడం ద్వారా మీ ఇంటి కరెంటు బిల్లు కూడా జీరో అయిపోతుంది. అంతేకాకుండా ఈ పథకంపై భారీ ఎత్తున సబ్సిడీ కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ పోర్టల్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్‌ను మార్చి 2026 వరకు పొడిగించినందున లక్ష్యాన్ని చేరుకునే వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఏ కంపెనీకి అదనపు మొత్తాన్ని చెల్లించవద్దని, అలాగే మీటర్, టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని రెసిడెన్షియల్ వినియోగదారులందరికీ సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి:
ఏదైనా విక్రేత, ఏజెన్సీ లేదా వ్యక్తి నుండి అదనపు రుసుము కోరినప్పుడు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం కింద దేశం మొత్తానికి మూడు కిలోవాట్ల కెపాసిటీకి కిలోవాట్‌కు రూ. 4,588 సబ్సిడీ పొందవచ్చు.
రూ. 43 వేలకు పైగా సబ్సిడీ
మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌పై ప్రభుత్వం రూ.43,000 కంటే ఎక్కువ సబ్సిడీ ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చుకునే సువర్ణావకాశం దక్కించుకోవచ్చు. మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌తో మీరు మీ ఇంట్లో ఏసీ, ఫ్రీజ్, కూలర్, టీవీ, మోటార్, ఫ్యాన్ మొదలైనవాటిని నడపవచ్చు. దీని కోసం మీరు నెలనెల ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మిగులు విద్యుత్‌ను అద్దెదారులకు లేదా పొరుగువారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.
This comment has been removed by the author.
ReplyDelete