SBI LOAN 2022
కస్టమర్లకు ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ చార్జీలు మాఫీ!
State Bank Of India: మీరు కొత్తగా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. పలు రకాల రుణాలపై చార్జీలు మాఫీ చేసింది.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందిచింది. కొత్త ఏడాది ఆఫర్లు ప్రకటించింది. లోన్ తీసుకునే వారికి దీని వల్ల ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
ఎస్‌బీఐ న్యూ ఇయర్ ఆఫర్ల ప్రకారం చూస్తే.. గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ వంటి వాటిపై బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. అంటే ప్రాసెసింగ్ చార్జీలు లేకుండానే మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు.
యోనో యాప్ ద్వారా రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. తద్వారా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. లోన్ తీసుకునే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదని తెలిపింది.
పర్సనల్ లోన్ తీసుకునే వారికి రూ.లక్షకు ఈఎంఐ రూ. 1898 నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే గోల్డ్ లోన్ తీసుకుంటే.. రూ.లక్షకు రూ. 3161 ఈఎంఐ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక కారు లోన్ అయితే రూ. లక్షకు రూ. 1586 మేర ఈఎంఐ పడుతుంది.
అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి కూడా తీపికబురు అందించిన విషయం తెలిసిందే. జనవరి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. అందువల్ల బ్యాంక్ నుంచి లోన్ పొందే వారికి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ పొందొచ్చు.
అందుబాటు వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ పొందొచ్చని, అలాగే ఎలాంటి హిడెన్ చార్జీలు ఉండవని ఎస్‌బీఐ పేర్కొంటోంది. ఇవి పరిమిత కాల ఆఫర్లు అన్ని గుర్తించుకోవాలి. అందువల్ల మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. వెంటనే త్వరపడటం ఉత్తమం.
ఇకపోతే ఎస్‌బీఐ నుంచి రూ. 35 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందొచ్చు. పర్సనల్ లోన్ డబ్బులు వెంటనే బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయని స్టేట్ బ్యాంక్ పేర్కొంటోంది. అందువల్ల పర్సనల్ లోన్ పొందాలని భావించే వారు యోనో యాప్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు.
ఇకపోతే బ్యాంక్ నుంచి లోన్ పొందే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. మీ అర్హత ప్రాతిపదికన మీకు లభించే లోన్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. అర్హత కలిగిన వారికి బ్యాంక్ ప్రిఅప్రూవ్డ్ లోన్స్ కూడా అందిస్తూ ఉంటుంది. ఈ తరహా రుణాలు అయితే వెంటనే పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదు. క్షణాల్లో అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.
COMMENTS