REFUND WRONG UPI TRANSACTION 2022
మీరు పొరపాటున మరో UPI IDకి డబ్బులను పంపారా? ఆందోళన అక్కర్లేదు.. ఇలా ఈజీగా రీఫండ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున యూపీఐ ద్వారా మరొకరికి పేమెంట్ చేశారా? అయితే ఆందోళన అక్కర్లేదు. మీరు పంపిన నగదు తిరిగి సులభంగా పొందవచ్చు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతీయ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనేక మార్పులు చేసింది. యూపీఐ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో ఎప్పుడైనా నేరుగా బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకునే వీలుంది. అయితే UPI సిస్టమ్ సురక్షితంగా ఉన్నప్పటికీ, డిజిటల్ గేట్‌వే తరచుగా డబ్బును డెబిట్ చేసిన తర్వాత లావాదేవీలు నిలిచిపోవడం జరుగుతుంటాయి. ఫలితంగా కొన్నిసార్లు UPI మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మొబైల్ నంబర్ లేదా QR Code ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీని అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
కొన్నిసార్లు తెలియకుండానే నగదు పంపాల్సిన అకౌంట్ బదులుగా మరో యూపీఐ అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. వినియోగదారులు BHIM యాప్ లేదా GPay, PhonePe వంటి మరిన్ని ఇతర UPI సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా UPI పేమెంట్లు చేస్తుంటారు. అయినప్పటికీ, అన్ని భద్రతా ఫీచర్లు, సూచనలు ఉన్నప్పటికీ, యూజర్లు తరచుగా రిసీవర్ ఫోన్ నంబర్ లేదా QR కోడ్ కోసం రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటుగా వేరొకరి బ్యాంక్ అకౌంటుకు డబ్బు పంపుకోవచ్చు. UPI లావాదేవీలు ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని తిరిగి పొందడం కష్టమే. కానీ, దీనికి పరిష్కారం కూడా ఉంది. UPI ద్వారా అనాలోచిత లావాదేవీకి సంబంధించి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
UPI యాప్ సపోర్ట్‌ని సంప్రదించండి :
RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ముందుగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌తో ఉద్దేశపూర్వక లావాదేవీల సమస్యను నివేదించాలి. మీరు డబ్బును బదిలీ చేసిన GPay, PhonePe, Paytm లేదా UPI యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లకు సపోర్టును అందిస్తోంది. మీరు మీ సమస్యను ఫ్లాగ్ చేయవచ్చు. లేదంటే నగదు వాపసు కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
COMMENTS