OPSC Medical Officer posts 2022
3481 మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
OPSC Medical Officer posts : మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది ఓపీఎస్సీ(ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్). అప్లిక్లేషన్ ప్రక్రియ.. opsc.gov.in లో ఈ నెల 27న ప్రారంభమవుతుంది. 2023 జనవరి 27న ముగుస్తుంది.
అర్హత..
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన మెడికల్ కాలేజ్ లేదా మెడికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ లేదా అందుకు సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి.
2022 జనవరి 1 నాటికి అభ్యర్థులు 21ఏళ్లు- 38ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే.. 1984 జనవరి 2కు ముందు, 2001 జనవరి 1 తర్వాత జన్మించిన వారు ఈ పోస్టులకు అర్హులు కారు.
ఖాళీలు ఇలా..
మొత్తం పోస్టులు 3481. ఇందులో 1000 పోస్టులు అన్రిజర్వ్డ్, 224 పోస్టులు ఎస్ఈబీఎస్, 852 పోస్టులు షెడ్యూల్డ్ కేటగిరీ, 1404 పోస్టులు షెడ్యూల్డ్ ట్రైబ్ కోసం కేటాయించారు.
సెలక్షన్ ప్రక్రియ..
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఇందులో 200 మార్కుల పేపర్ ఉంటుంది. 200 ప్రశ్నలు ఉంటాయి. అంటే.. ప్రతీ ప్రశ్నకు 1 మార్క్ అని అర్థం. ఈ ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ పాటర్న్లో ఉంటాయి. పరీక్ష నిడివి 3 గంటలు.
ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1:- www.opsc.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి
స్టెప్ 2:- అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి
స్టెప్ 3:- రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి
స్టెప్ 4:- సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి
స్టెప్ 5:- సబ్మీట్ ప్రెస్ చేయండి. కాపీని ప్రింటౌంట్ తీసుకోండి
ఎగ్జామ్ ఫీజు..
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఓపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీలకు మినహాయింపు లభిస్తుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS