LIC NEW POLICY 2022
ఎల్ఐసీలో సరికొత్త పాలసీ రూ.100 పెట్టుబడితో పది లక్షల రాబడి
చిన్న మొత్తాల్లో పొదుపు చేసి అధికంగా రిటర్న్స్ పొందాలంటే అందరూ ఎల్ ఐసీ పాలసీలు తీసుకోవడం మంచిది అని సూచిస్తుంటారు. ఎందుకంటే భారతీయ జీవిత భీమా సంస్థ అంటే కచ్చితంగా మన పెట్టుబడి భద్రంగా ఉంటుందని అందరి నమ్మకం. ఎన్ని ప్రైవేట్ ఇన్సురెన్సు కంపెనీలు వచ్చినా ఎల్ఐసీ సరికొత్త పాలసీలను ప్రవేశ పెడుతూ వినియోగదారుల నమ్మకాన్ని పొందుతుంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ పేరుతో మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీలో ప్రతి రోజూ రూ.100 చొప్పున పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెడితే డబుల్ బోనస్ వస్తుందని ప్రకటించింది. ఈ పాలసీ మంచి రాబడికి హామీ ఇవ్వడమే కాకుండా బీమా కవరేజీ సైతం అందిస్తుంది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ లో కేవలం ఇన్సురెన్స్ కవరేజీ మాత్రమే కాదు పెట్టుబడిదారులకు కూడా మంచి బెనిఫిట్స్ ను ఇస్తుంది. పెట్టిన పెట్టుబడి డబుల్ అవ్వాలంటే ఈ పాలసీ బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. రోజుకు రూ.100 తక్కువ పెట్టుబడి పెడితే నిర్ణీత మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. ఈ పాలసీ ప్రాథమిక ప్లాన్‌లో పెట్టుబడి పెడితే ఐదు లక్షల హామీ మొత్తాన్ని, 8.60 లక్షల రివిజనల్ బోనస్ పొందుతారు. అయితే, మీ లాభాలను రెట్టింపు చేయడానికి, మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అప్పుడు మాత్రమే మీరు డబుల్ బోనస్‌ను స్వీకరించడానికి అర్హులవుతారు.
ఎల్‌ఐసి జీవన్ ఆనంద్ పాలసీ కోసం ప్రాథమిక ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి వార్షిక ప్రీమియంగా రూ. 27,000 డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా కట్టాలి. అప్పుడు నెలవారీ ప్రీమియం దాదాపు రూ. 2300 గా ఉంటుంది. ఇది రూ. 100 కంటే తక్కువ. ఈ విధంగా ప్రతి నెలా కడితే వచ్చే 21 ఏళ్లలో దాదాపు రూ.5.60 లక్షలు జమ కానున్నాయి. అదే సమయంలో, బోనస్‌తో, మీరు రూ. 10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పొందుతారు.
ఎల్ ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం, టర్మ్ అష్యూరెన్స్, అనారోగ్య బీమా వంటి సౌకర్యాలు ఉంటాయి. , అనుకోని పరిస్థితుల కారణంగా పాలసీదారు మరణిస్తే, బీమా మొత్తంలో 125% నామినీకి ఇస్తారు.
COMMENTS