INDIAN AIR FORCE 2022
ఆర్మీ జాబ్స్! ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 108 అప్రెంటిప్ ట్రైనింగ్ ఖాళీలు.. పదో తరగతి పాసైతే చాలు..
భారత త్రివిద దళాల్లో భాగమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. 108 అప్రెంటిప్ ట్రైనింగ్ (టెక్నికల్ ట్రేడుల్లో) ఖాళీల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతిలో 50 మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇంటర్మీడియట్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అలాగే ప్రకటనలో సూచించిన విధంగా శారీరక కొలతలు ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 14 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 5, 2023వ తేదీల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి.
రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష ఫిబ్రవరి 23 -మార్చి 1, 2023 నెలల్లో ఉంటుంది.
తుదా ఫలితాలు మార్చి 3న ప్రకటిస్తారు.
ట్రైనింగ్ ఏప్రిల్ 3, 2023వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.8,855ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
మెషినిస్ట్ ఖాళీలు: 3
స్టీల్ మెటల్ ఖాళీలు: 15
వెల్డర్ (గ్యాస్/ఎలక్ట్రానిక్స్) ఖాళీలు: 4
మెకానిక్ రేడియో రాడర్ ఎయిర్‌కాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఖాళీలు: 13
కార్పెంటర్ ఖాళీలు: 2
ఎలక్ట్రీషియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఖాళీలు: 33
ఫిట్టర్/మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఖాళీలు: 38
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS