If someone passes away inside the house during that year, what should be done? Do you understand the wrong things to do?
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాదిలో ఎటువంటి పనులు చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో చనిపోతే అనేక రకాల నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎవరైనా ఇంట్లో వారు చనిపోయినప్పుడు కొన్ని నెలలు లేదా ఏడాది పాటు ఇంట్లో పూజలు చేసుకోక పోవడం అలాగే ఆలయాలకు వెళ్లకపోవడం లాంటివి చేస్తుంటారు.
ఇంకొందరు అయితే ఇంట్లో ఉండే దేవుడీ పటాలను ఒక బట్ట లాంటి దాంట్లో చుట్టేసి పైన పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఆపై ఏడాది తరువాత మళ్ళీ ఇంట్లో పూజ చేయడం మొదలు పెడతారు. అంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు ఇంట్లో పూజ చేయరన్నమాట.
అయితే ఇలా చేయడం సరైనది కాదు అంటున్నారు శాస్త్ర నిపుణులు. అయితే చాలా మందికీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ఏమి చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయం లో కొన్ని సందేహాలు ఉంటాయి. మరి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ తరువాత ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసకుందాం..శాస్త్ర ప్రకారం గా దీపం లేని ఇంటిని స్మశానంతో సమానం అని చెబుతూ ఉంటారు. దీపం శుభానికి సంకేతం. భక్తితో దీపం వెలిగిస్తే అక్కడ దేవతలు తిరుగుతారు అని విశ్వసిస్తూ ఉంటారు.
అందుకే ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య దీపారాధన జరగాలి అని శాస్త్రం చెబుతోంది. అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత దీపం వెలిగించకుండా ఉండడం మంచిది కాదు కదా.. అంటే చనిపోయిన తర్వాత 11 రోజులకు దినాలు లేదా శుద్ధి కార్యక్రమం జరుపుకుంటారు. ఆ తర్వాత 12వ రోజు నుంచి ప్రతి రోజు నిత్య దీపారాధన చేసుకోవచ్చు. అయితే దీపారాధన చేసుకోవచ్చు కానీ, పండుగలు, ప్రత్యేక పూజలు, శుభకార్యాలు చేసుకోకూడదు. అలాగే దీపం పెట్టడం కూడా మానేయకూడదు. ఇక ఆలయాలకు వెళ్ళకూడదు అన్న నిబంధన అయితే ఏమీ లేదు. ఆలయానికి వెళ్ళినా కూడా అర్చనలు అభిషేకాలు చేయించకూడదు. కొబ్బరి కాయ కొట్టకూడదు. కానీ దేవుడు దర్శనం చేసుకోవచ్చు.
COMMENTS