FD Interest Rates 2023
ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై 8.35 శాతం వడ్డీ ఆఫర్
మన దగ్గర రిటైర్మెంట్ డబ్బు లేదా ఇతర ఆదాయ మార్గాల్లో సమకూరిన డబ్బును ఎందులో పెట్టుబడి పెట్టాలో? అని ఆలోచిస్తుంటాం. అయితే తెలిసిన వాళ్లకు వడ్డీకి ఇస్తే వారు సక్రమంగా ఇస్తారో? లేదో? అని అనుమానంలో ఉంటాం. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టడం మేలని అందరూ సూచిస్తుంటారు. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఏ బ్యాంక్ ఎంత శాతం వడ్డీ అందిస్తుందో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఆయా బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల విషయంలో కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో డీసీబీ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు అదిరిపోయే వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. ఏ ఇతర బ్యాంక్ ప్రకటించని విధంగా సీనియర్ సిటిజన్ల ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఏకంగా 8.36 శాతం వడ్డీని ఆఫర్ ను ప్రకటించింది.
వడ్డీ రేట్ల పెంపు ఇలా
ప్రైవేట్ రంగంలోని రుణదాతల్లో డీసీబీ రూ.2 కోట్ల వరకూ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ పెంపును ప్రకటించింది. డిసెంబర్ 21, 2022 నుంచి వడ్డీ పెంపు అమల్లోకి వస్తుందని బ్యాంక్ వెబ్ సైట్ లో ప్రకటించింది. ఈ సవరణ తర్వాత సాధారణ ప్రజలకు తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 7.60 వరకూ పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.25 నుంచి 8.10 శాతం వరకూ వడ్డీ రేట్లను అందిస్తుంది. అలాగే బ్యాంక్ 700 రోజుల నుంచి 36 నెలల కాలంపైగా మెచ్యూర్ అయ్యే డిపాజిట్ వడ్డీ రేట్ ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం ఉండగా ప్రస్తుతం 8.35 శాతంగా ఉండనుంది. అయితే ఈ వడ్డీ రేట్ లు మెచ్యూర్ అయ్యే సమయం బట్టి మారుతున్నాయి.
ప్రస్తుతం డీసీబీ బ్యాంక్ 7 నుంచి 45 రోజుల్లో మెచ్యూరయ్యే డిపాజిట్లకు 3.75 శాతం వడ్డీ అందిస్తుంది. తదుపరి 46 నుంచి రోజుల నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై నాలుగు శాతం, 91 రోజుల నుంచి ఆరు నెలల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.75 శాతం, ఆరు నెలల నుంచి పన్నెండు నెలల లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.25 శాతం వడ్డీ రేట్ ను అందిస్తుంది. అలాగే 12 నుంచి 18 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 7.25 శాతం వడ్డీని పొందుతాయి. అయితే 18 నుంచి 700 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 7.50% వడ్డీని అందిస్తుంది.
COMMENTS