FARMER SCHEMES 2023
రైతుల కోసం 6 అదిరిపోయే స్కీమ్స్.. ప్రతి ఏడాది అకౌంట్లలోకి రూ.42 వేలు, సులభంగా రుణాలు!
PM Kisan Scheme: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో చేరడం వల్ల ప్రయోజనం పొందొచ్చు. ఉచితంగా డబ్బులు, పంట బీమా, పెన్షన్ వంటి పలు బెనిఫిట్స్ ఉన్నాయి.
PM Kisan Maan Dhan : కేంద్ర ప్రభుత్వం రైతులకు పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. పీఎం కిసాన్ దగ్గరి నుంచి వడ్డీ రాయితీ వరకు పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటిల్లో చేరడం వల్ల అన్నదాతలకు చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఏ ఏ స్కీమ్‌తో ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.
కిసాన్ క్రెడిట్ కార్డు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను లాంచ్ చేసింది. దీని వల్ల రైతులకు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. రైతులు అందరూ ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందొచ్చు. ఈ పథకంలో చేరిన వారికి ఏటీఎం రూపే కార్డు అందిస్తున్నారు. క్రెడిట్ లిమిట్ లభిస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. ఉపయోగించిన డబ్బులను మళ్లీ కట్టాలి. కమర్షియల్ బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఈ స్కీమ్‌ను అమలు చేస్తున్నాయి.
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా ఉంది. 2016 నుంచే ఈ స్కీమ్ అమలులో ఉంది. ప్రతికూల పర్యావరణం కారణంగా పంట నష్టం సంభవిస్తే.. ఈ స్కీమ్ కింద రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమంగా పంచుకుంటాయి. లోన్ తీసుకున్న రైతులు ఈ స్కీమ్‌లో కచ్చితంగా చేరాల్సి ఉంటుంది.
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా ఉంది. ఇది పెన్షన్ పథకం అని చెప్పుకోవచ్చు. రైతులు ఇందులో చేరొచ్చు. 2019లో ఈ పథకం అమలులోకి వచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. నెలకు రూ.55 నుంచి రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. గరిష్టంగా రూ. 3 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. 60 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తుంది.
ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన కూడా ఉంది. 2015లో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ భూమిని పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చారు. నీటీ పారుదలకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ స్కీమ్ కింద 2021-22 నాటికి 10 లక్షలకు పైగా హెక్టార్ల భూమిని సాగు చేశారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఉంది. ఈ స్కీమ్ కింద రైతులు ప్రతి ఏటా రూ. 6 వేలు పొందొచ్చు. మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున ఈ డబ్బులు లభిస్తున్నాయి. 218 నుంచి ఈ స్కీమ్ అమలులోకి వచ్చింది.
ఆధార్, బ్యాంక్ అకౌంట్, పొలం పట్టా ఉన్న రైతులు ఈ పథకంలో చేరొచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి నేరుగా స్కీమ్‌లో చేరొచ్చు. ఇప్పటి వరకు 12 విడతల డబ్బులు వచ్చాయి. అంటే అర్హత కలిగిన రైతులకు ఒక్కొక్కరికి రూ. 24 వేలు అందాయి.
వడ్డీ రాయితీ స్కీమ్‌ను మళ్లీ తీసుకువచ్చారు. 2022 ఆగస్ట్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటులో 1.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. అలాగే కచ్చితంగా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని చెల్లిస్తూ రావాలి. అంటే వడ్డీ కట్టి, మళ్లీ లోన్ రీషెడ్యూల్ చేసుకోవాలి.
COMMENTS