DRUG INSPECTOR JOBS 2022
తెలంగాణలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
Drug Inspector Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్ని భర్తీచ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 16 నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2023 జనవరి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
టిఎస్‌పిఎస్సీ భర్తీ చేయనున్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5ఉద్యోగాలు మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్ల మధ్య వయసు ఉన్న వారై ఉండాలి.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 2023 మే, జూన్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు www.tspsc.gov.inలో అందుబాటులో ఉంటాయని టిఎస్‌పిఎస్సీ కార్యదర్శి తెలిపారు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామకాలను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ లేదంటే ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు. ఫార్మసీలో డిగ్రీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, డిఫార్మసి, మెడిసిన్‌లో క్లినికల్ ఫార్మకాలజీ డిగ్రీ, మైక్రో బయాలజీలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల్లో తెలంగాణ ఆర్టీసి, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ఉద్యోగులకు ఐదేళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపునిస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌సిసి ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి మూడేళ్ల మినహాయింపు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్ విభాగాల్లో ఐదేళ్ల సడలింపునిస్తారు.
దరఖాస్తు ఫీజు....
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారు రూ.200 రుపాయలు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువత ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR APPLY CLICKHERE
COMMENTS