BALIKA SAMRUDDHI YOJANA SCHEME 2022
ఈ పథకం ద్వారా అమ్మాయిలను ఉచితంగానే చదివించవచ్చు.. మరి దీని గురించి మీకు తెలుసా..?
మానవ జీవితంలో ప్రతి పనీ డబ్బుల మీదనే ఆధారపడి జరుగుతుంది. ఏ చిన్న పని చేయాలన్నా డబ్బులు తప్పనిసరి. ముఖ్యంగా విద్య, వైద్యం విషయంలో డబ్బులు లేకపోతే ఇక పరిస్థితి చేజారినట్లే. అవసరమైన సమయంలో డబ్బులు లేక చదువుకోలేని చిన్నారులు, వైద్యం దొరకకపోవడంతో చనిపోయినవారు చాలా మందే ఉన్నారు. ఆర్థిక సమస్యల వల్ల చాలా మంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు. చదువులో ముందున్నప్పటికీ డబ్బు లేని కారణంగా చదువుకోలేరు కొందరు చిన్నారులు. ఈ పరిస్థితి దివువ, మధ్య తరగతి కుటుంబాలలో ఉండే సర్వసాధారనమైన సమస్యలలో ఇది కూడా ఒకటి. అందుకే చాలా మంది కొడుకును చదివించి, కూతురుని చదివించడానికి వెనకాడతారు. అందుకోసమే కేంద్రప్రభుత్వం అలాంటి చిన్నారుల కోసం ఓ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా డబ్బులు కట్టకుండానే బాలికలను కూడా ఉచితంగా చదువుకోవచ్చు. వారి విద్యకు అయ్యే ఖర్చును అంతా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
బాలికల భవిష్యత్తు కోసం
బాలికా సమృద్ధి యోజన పథకాన్ని 1997 అక్టోబర్ 2న, అప్పటి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని బాలికలకు ఉచిత విద్యను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని బాలికలలో కూడా అక్షరాస్యతను పెంచేందుకు, వారి భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రవేశపెట్టింది.
ఈ పథకానికి అర్హులు ఎవరంటే..?
15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే బాలికా సమృద్ధి యోజన పథకానికి అర్హులు. ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న బాలికలందరూ ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వారిద్దరూ ఈ పథకానికి అర్హులే. ప్రతి ఏటా వారి చదువు కోసం స్కాలర్ఫిప్ ను అందిస్తారు. అయితే ఈ పథకంలోని బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేస్తే వారు ప్రయోజనాలు పొందడానికి అనర్హులు అవుతారు.
ఈ స్కాలర్‌షిప్ పొందడం ఎలా..?
ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు 1 నుంచి మూడో తరగతి వరకు ప్రతీ ఏడాది రూ.300 వస్తాయి. 4వ తరగతిలో రూ.500.. ఐదో తరగతిలో రూ.600.. 6, 7 తరగతులకు రూ.700. అందుతాయి. ఎనిమిదవ తరగతిలో రూ.800.. 9, 10 తరగతులలో రూ.1000 స్కాలర్‌షిప్ ఇస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
ఈ ప్రయోజనాలను పొందడం కోసం అంగన్‌వాడీ కేంద్రంలో కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.
పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్..
- ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం.
- తల్లి లేదా కుమార్తె బ్యాంక్ ఖాతా.
అడ్రస్ ప్రూఫ్.
18 సంవత్సరాలు నిండిన తర్వాత గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ నుంచి బాలికకు వివాహం కాలేదని సర్టిఫికేట్ తీసుకుని అధికారులకు ఇవ్వాలి.
COMMENTS