ATM NEWS 2022
అకౌంట్లో డబ్బులు కట్ అయ్యి క్యాష్ రాలేదా..? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..
ATM News: ఏటీఎంలను వినియోగించటం రోజువారీ జీవితంలో అనివార్యం. అయితే వీటిలో కొన్నిసార్లు ఏర్పడే సాంకేతిక సమస్యలు ఏటీఎం యూజర్లకు ఆర్థికంగా నష్టాలను కూడా కలిగిస్తుంటాయి. ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసుకునేటప్పుడు కొన్నిసార్లు యాదృచికంగా మిషన్ నుంచి డబ్బు రాకుండానే అకౌంట్లో సొమ్ము కట్ అయినట్లు ఎస్ఎమ్ఎస్ వస్తుంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లావాదేవీ విఫలం..
కొన్ని సార్లు ఏటీఎంలలో డబ్బు డ్రా చేసినప్పుడు అవి విఫలం అవుతుంటాయి. అయితే బ్యాంకులు సాధారణంగా తమ మెషిన్లను తనిఖీ చేస్తుంటాయి. అలా సాంకేతిక సమస్యల కారణంగా వచ్చిన ఫిర్యాదులను బ్యాంకులు త్వరగా పరిష్కరిస్తుంటాయి. ఇందులో భాగంగా మీ ఖాతాలో నుంచి కట్ అయిన సొమ్ము ఆటోమెటిక్ గా తిరిగి జమ అవుతుంది. బ్యాంకులు అదే విషయాన్ని సదరు కస్టమర్లకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాయి.
వినియోగదారులు తమ కార్డులను వినియోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏటీఎం కార్డు మెషిన్లో ఎంటర్ చేసే టప్పుడు వాటిని ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలి. ఎందుకంటే కార్డు పెట్టే స్లాట్లలో సైబర్ నేరగాళ్లు స్కిమ్మర్లను అమర్చుతుంటారు. అలా వారు కస్టమర్ల కార్డ్ డేటాను మాగ్నెటిక్ స్ట్రిప్ నుంచి తస్కరిస్తుంటాయి. ఆ సమాచారాన్ని క్లోన్ చేయటం ద్వారా అకౌంట్ల నుంచి డబ్బును విత్ డ్రా చేయటానికి ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి వాటిపై బ్యాంకులు, ఆర్బీఐ కూడా దృష్టి సారించింది.
ట్రాన్సాక్షన్ స్లిప్..
మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయ్యి ఏటీఎం మెషిన్ నుంచి సొమ్ము బయటకు రానప్పుడు ఆ లావాదేవీ రసీదును జాగ్రత్తగా ఉంచాలి. అది కీలకమైన రుజువుగా ఉంటుంది. అలా జరిగిన వెంటనే బ్యాంక్ కు సంబంధించిన 24 గంటల కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్ కు కాల్ చేసి తొలుత ఫిర్యాదు చేయాలి. అలా ఫిర్యాదు చేసిన తర్వాతం ఏడు రోజుల్లోగా బ్యాంకులు దానిని పరిష్కరించి డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆలస్యం చేసే ప్రతిరోజుకు రూ.100 ఫిర్యాదు దారునికి చెల్లించాల్సి ఉంటుంది.
రెండోదశ..
మెుదటి దశలో ఫిర్యాదు పరిష్కారం కాకపోతే సమీప బ్యాంక్ శాఖను సందర్శించి హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదు చేయాలి. మీ ఫిర్యాదు ఈ విధంగా పరిష్కరించబడకపోతే, ఫిర్యాదు దారుడు తనకు అకౌంట్ ఉన్న బ్రాంచ్ కి వెళ్లి మేనేజర్‌ని సంప్రదించాలి. బ్యాంక్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా మీ ఫిర్యాదును బ్యాంక్ పరిష్కరించకపోతే.. RBI లేదా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించాలి. మెయిల్ ద్వారా ఫిర్యాదును అందించవచ్చు. అయితే అంతిమంగా ఈ మార్గాన్ని ఎంచుకోవటానికి ముందుగా బ్యాంక్ కస్టమర్ ఫిర్యాదు చేసి కనీసం 30 రోజులు పూర్తై ఉండాలి. ఈ పద్ధతిలో మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు.
COMMENTS