VSSC Recruitment 2022
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు.. ఈ అర్హతలున్నవారు నేరుగా ఇంటర్వ్యూకు..
భారత ప్రభుత్వ స్పేస్ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్.. 194 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, 60 శాతం మార్కులతో హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ డిగ్రీ, 60 శాతం మార్కులతో ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్/కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్‌లో బీకాం లేదా తత్సమాన కోర్సులో 2020 ఏప్రిల్‌కు ముందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 30, 2022వ తేదీ నాటికి 30 యేళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలున్నవారు నవంబర్ 12, 2022వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.9000లు స్టైపెండ్ చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ఎయిరోనాటికల్/ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ ఖాళీలు: 15
కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్ ఖాళీలు: 20
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు: 43
మెటలర్జీ ఖాళీలు: 6
ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఖాళీలు: 4
ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఖాళీలు: 2
హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ ఖాళీలు: 4
బీకాం(ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్) ఖాళీలు: 25
బీకాం (కంప్యూటర్ అప్లికేషన్) ఖాళీలు: 75
అడ్రస్:
Main Auditorium, St.Mary’s Higher Secondary School, Pattom,
Thiruvananthapuram, Kerala.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS