The Nara Disti Methods
నరఘోష తగలకుండా ఉండాలంటే .ఇవి పాటించండి
నరఘోష నివారణ మార్గాలు.
ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు.
నరఘోశ ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా దెబ్బలు తగులుతూ ఉండటం లేక మనః శాంతి: లేకపోవడం,ఎక్కువ టెన్షన్లు కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకి శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసిరాకపోవడం, వందరూపాయలు రావలసినచోట పదిరూపాయలు మాత్రమే మీ చేతికి రావటం లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోష మూలముగా చెప్పుకోవచ్చు.ఈ నరఘోష అనేదటువంటిది దాదాపుగా అందరికీ ఉంటుంది.ఈ నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా పైన ఉదహరించినటువంటి భాదలు పడేవారు నరసింహస్వామి వారి యొక్క పటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి.
ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు.
అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచం తెచ్చుకొని నాగాసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజూ పెట్టుకుంటూ ఉండాలి.అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలుకు నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే కనుక ఎరుపురంగు మొలతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపుదారాన్ని మొలతాడుగా కట్టి ఎడమఅరికాలుకు కాటుకబొట్టు పెడుతూఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలుకు కాటుక బొట్టు పెట్టాలి.కుంకుమబొట్టుని ముఖానికి పెడుతూ ఉండాలి.ఈ విధంగా చేయటం వలన ఈ యొక్క నరఘోష,నరపీడ అనేటటువంటివి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుఖాణాల్లో స్పటిక అని ఒకటి దొరుకుతుంది. కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది. అది తెచ్చుకుని ఒక ఎరుపురంగు బట్టలో కొంచెంపసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తొలగుతుందని అని పెద్దల మాట.
గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి?
దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారం.. వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.
ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు.
అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు. ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుంది.
బాల గ్రహ దోషముల నివారణకు.
పిల్లలకు దిష్టి తీసే సమయంలో, పళ్లెంలో నీళ్లు పోసి, అందులో కుంకుమ వేసి, మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి, దిష్టి తీసి, ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి. ఇలా చేస్తే బాల గ్రహ దోషములు పోవును.
COMMENTS