The 60-year-olds with the best plans received good news from the centre.
60 ఏళ్లు నిండిన వృద్ధులకు బెస్ట్ స్కీమ్స్‌తో శుభవార్త చెప్పిన కేంద్రం..
భారతీయులకు పెట్టుబడుల పై క్రమంగా అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు సేవింగ్స్ స్కీమ్స్ డిపాజిట్లతో సంతృప్తి చెందిన ప్రజలు, ఇప్పుడు రిస్క్ తక్కువగా ఉండే ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దృష్టి సారిస్తున్నారు.
ముఖ్యంగా 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు స్కీమ్స్ ద్వారా వివిధ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. అనేక పన్ను ప్రయోజనాలు, అధిక వడ్డీ రేట్లతో వచ్చే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే మలి వయసులో రెగ్యులర్ ఇన్‌కమ్ అందించే రెండు స్కీమ్స్ మాత్రం పాపులర్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీఎం వయ వందన యోజన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తోంది. వృద్ధ దంపతులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో క్రమమైన, స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ రెండు పథకాలకు ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. వీటిల్లో రిస్క్ కూడా ఉండదు.
ప్రభుత్వ హామీ ప్రకారం స్కీమ్ టెన్యూర్ అంతా వడ్డీ పొందవచ్చు. కాగ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పీఎం వయ వందన యోజన ఇప్పుడు సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని అందిస్తాయి. ఎస్ సీఎస్ఎస్ స్కీమ్ టెన్యూర్ మూడు సంవత్సరాలు కాగా, మరో మూడు సంవత్సరాలు పథకాన్ని పొడిగించుకొనే అవకాశం ఉంది. పీఎంవీవీవై కి 10 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది.
ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆదాయాన్ని లాక్ చేసుకోవచ్చు. స్థిరంగా, రిస్క్‌లేని ఆదాయం అందుకోవాలని భావించే సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ ఫండ్‌ను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్ట పెట్టుబడిపై పరిమితి ఉంది. ఈ లిమిట్‌ను రూ.15 లక్షలుగా నిర్ణయించారు.
అయితే ఒక వ్యక్తి ఎస్ సీఎస్ఎస్, పీఎంవీవీవైలో ఒక్కో అకౌంట్‌ను మాత్రమే నిర్వహించే అవకాశం ఉంటుంది. దంపతులు అయితే ఒక్కొక్కరు రూ.15 లక్షల చొప్పున ఎస్ సీఎస్ఎస్, పీఎంవీవీవైలో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే రెండు అకౌంట్‌లకు వేర్వేరుగా ప్రైమరీ, సెకండరీ హోల్డర్‌లను ఉంచవచ్చు. జంటగా ఎస్ సీఎస్ఎస్ లో కేవలం రూ.15 లక్షలకు బదులుగా మొత్తం రూ.30 లక్షలు, అలాగే పీఎంవీవీవైలో మరో రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ లెక్కన దంపతులు ఇద్దరూ 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును పొందుతారు. భర్త ఎస్ సీఎస్ఎస్ నుంచి రూ. 1.11 లక్షల వార్షిక వడ్డీ, భార్య ఎస్ సీఎస్ఎస్ నుంచి రూ. 1.11 లక్షల వార్షిక వడ్డీ లభిస్తుంది. అదే విధంగా భర్త పీఎంవీవీవై నుంచి రూ.1.11 లక్షల వార్షిక వడ్డీ, భార్య పీఎంవీవీవై నుంచి రూ. 1.11 లక్షల వార్షిక వడ్డీ అందుతుంది. అంటే ఏడాదికి మొత్తం రూ.4.44 లక్షలు రాబడి పొందవచ్చు. దీన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే దాదాపు రూ.36,000 నుంచి రూ.37,000 వరకు లభిస్తుంది. పీఎంవీవీవై నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ఎంపికలను అందిస్తుంది. సీఎస్ఎస్ లో మాత్రం త్రైమాసిక చెల్లింపు విధానం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సీఎస్ఎస్, పీఎంవీవీవై ద్వారా మాత్రమే వచ్చే ఆదాయం సరిపోదని భావించేవారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, ఆర్ బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ వంటి స్కీమ్‌లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.
COMMENTS