SBI Vs Post office: SBI Fixed Deposits Vs Post Office Deposits
SBI Vs Post office: ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ Vs పోస్టాఫీస్ డిపాజిట్స్
పెట్టుబడి భద్రతతో పాటు రాబడికి హామీ ఉండడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెట్టుబడిదారుల్లో మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ సహా అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. అలాగే పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు కూడా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే పనిచేస్తాయి. వీటిలో కూడా పెట్టుబడికి భద్రత ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ లేదా టర్మ్ డిపాజిట్లు.
భారతీయ తపాలా శాఖ వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. అందులో పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ పథకం ఒకటి. ఈ పథకం కూడా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే సురక్షితమైన పెట్టుబడి మార్గం. ఇందులో వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తారు. మూడు నెలలకోసారి వడ్డీ లెక్కిస్తారు. ఏడాదికోసారి చెల్లిస్తారు. పోస్టాఫీసులు ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నారనే దానిపై హామీనిచ్చే రాబడి ఉంటుంది.
పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లో)
1 సంవత్సరం డిపాజిట్లపై - 5.5 శాతం
2 సంవత్సరాల డిపాజిట్లపై - 5.5 శాతం
3 సంవత్సరాల డిపాజిట్లపై - 5.5 శాతం
5 సంవత్సరాల డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.
ఎస్‌బీఐ 7 రోజుల నుంచి మొదలుకుని 10 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ ప్రజలకు వర్తించే వడ్డీ రేట్లు కాల వ్యవధిని బట్టి 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు మరో 0.5 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.
ఎస్‌బీఐ రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా..
7 రోజుల నుంచి 45 రోజులకు 2.9 శాతం
46 రోజుల నుంచి 179 రోజులకు 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజులకు 4.4 శాతం
211 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు 4.4 శాతం
ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు 5.5శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు 5.1 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు 5.3 శాతం
ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు 5.4 శాతం
(ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తించే ఈ వడ్డీ రేట్లు జనవరి 8, 2021 నుంచి అమల్లో ఉన్నాయి)
COMMENTS