BEL RECRUITMENT 2022
బీఈ/బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.55,000ల జీతం..
ఉత్తరాఖండ్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కోట్‌ద్వారా యూనిట్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 34 ట్రైనీ ఇంజినీర్-1, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వీటిల్లో ట్రైనీ ఇంజినీర్-1 పోస్టులు 15, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 19 వరకు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యునికేషన్/టెలీకమ్యునికేషన్/కమ్యునికేషన్/మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ తత్సమాన విభాగంలో బీఈ/బీటెక్ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు డిసెంబర్ 15, 2022వ తేదీ నాటికి ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 15, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయలో ప్రాజెక్ట్ ఇంజనీరి పోస్టులకు రూ.472లు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.177లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.30,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
The Manager (HR&A), Bharat Electronics Limited, Kotdwara, Pauri Garwhal, Uttarakhand – 246149.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLICATION CLICKHERE
COMMENTS