PGCIL RECRUITMENT 2022
బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆర్‌డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్‌లో భాగంగా ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 800 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (50), ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (15), ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ) (15), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్) (480), ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) (240) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-12-2022 నాటికి 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 23,000 నుంచి రూ. 1,05,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 21-11-2022న ప్రారంభమై 11-12-2022 తేదీతో ముగియనుంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS