NIT RECRUITMENT 2022
ఆకర్షణీయ వేతనంతో నిట్ రూర్కెలాలో 143 టీచింగ్ ఉద్యోగాలు.
ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ .. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్ డిజైన్, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యుమానిటీస్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో 143 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, సిరామిక్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ డిజైన్, లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, బీడీఈఎస్, ఎంఆర్క్/ఎంప్లాన్, ఎంబీఏ, పీజీడీబీఎమ్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS