Lost your Android or iPhone due to phone theft? You can locate it where it is?.
మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ పోయిందా ? ఎక్కడుందో ఇలా తెలుసుకోవచ్చు..!
స్మార్ట్ ఫోన్లు అనేవి ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. దీంతో అన్ని పనులకు వాటిని ఉపయోగిస్తున్నారు. వినోదం, విజ్ఞానంతోపాటు బ్యాంకింగ్ అవసరాలకు, ముఖ్యమైన సమాచాన్ని స్టోర్ చేసుకునేందుకు వాటిని ఉపయోగిస్తున్నారు.
అయితే అంతటి విలువైన సమాచారం ఉండే ఫోన్లు పోతే ఎవరికైనా ఇబ్బందే కలుగుతుంది. కానీ ఫోన్లలో ఉండే పలు టూల్స్ సహాయంతో పోయిన మీ ఫోన్ ఎక్కడుందో సులభంగా ఇట్టే కనిపెట్టవచ్చు. దీంతో ఫోన్‌ను వెదికి పట్టుకునేందుకు వీలవుతుంది. అందుకు ఏం చేయాలంటే…
ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. ఏ ఫోన్ పోయినా సరే.. ఆ ఫోన్‌లను సులభంగా వెదికి పట్టుకోవచ్చు. అందుకు గాను ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యూజర్లు గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయి ఉండాలి. అలాగే ఫోన్ మొబైల్ డేటా లేదా వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేసి ఉండాలి. అలాగే ఫైండ్ మై ఫోన్ సెట్టింగ్ కూడా ఆన్ చేసి ఉండాలి. ఈ క్రమంలో ఫోన్ పోయినప్పుడు దాన్ని సులభంగా వెదికేందుకు అవకాశం ఉంటుంది.
ముందుగా android.com/find అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో మీ గూగుల్ అకౌంట్‌తో సైనిన్ అవ్వాలి. తరువాత వచ్చే పేజీలో పై భాగంలో ఎడమ వైపు మీ ఫోన్ కనిపిస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ డివైస్ లు అయితే ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి అందులో పోయిన డివైస్‌ను ఎంచుకోవాలి. తరువాత డివైస్‌కు చెందిన బ్యాటరీ పవర్, వైఫై యాక్టివ్‌లో ఉందీ, లేనిదీ, దాని లోకేషన్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఇక యూజర్లు ఆ ఆప్షన్ల ద్వారా ఫోన్‌లో 5 నిమిషాల పాటు సౌండ్ వచ్చేలా ప్లే చేయవచ్చు. దీంతో ఫోన్ ఎక్కుడుందో తెలిసిపోతుంది. అలాగే ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ నంబర్ కూడా కనిపిస్తుంది. దాన్ని పోలీసులకు తెలియజేయవచ్చు. ఇక అక్కడే ఉండే సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్‌తో మీ గూగుల్ అకౌంట్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు. అలాగే ఫోన్ తెరపై ఓనర్ నంబర్ కనిపించేలా చేయవచ్చు. దీంతో ఫోన్ దొరికిన వారు ఓనర్‌కు ఆ వివరాలను తెలిపేందుకు అవకాశం ఉంటుంది.
ఇక అదే స్క్రీన్‌లో ఉండే ఎరేజ్ డివైస్ ఆప్షన్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లోని డేటాను రిమోట్‌గా డిలీట్ చేయవచ్చు. కానీ అప్పటికే డేటాను అవతలి వారు డిలీట్ చేసి ఉంటే ఫైండ్ మై డివైస్ ఫీచర్ పనిచేయదు. ఇక ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉంటే అది ఆన్‌లైన్‌లోకి రాగానే డేటా ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది.
ఆండ్రాయిడ్ లాగే ఐఫోన్‌లోనూ ఫైండ్ మై ఐఫోన్ ఆనే ఆప్షన్ ఉంటుంది. దీని సహాయంతో పోయిన ఫోన్‌ను వెదకవచ్చు. యూజర్లు icloud.com/find అనే సైట్‌లో యాపిల్ అకౌంట్‌తో ముందుగా లాగిన్ అవ్వాలి. తరువాత మీ ఐఫోన్ ఎక్కడుందో కొన్ని సెకన్లలోనే స్క్రీన్‌పై మ్యాప్‌లో చూపిస్తుంది. ఈ క్రమంలో అందులోనూ పైన తెలిపిన లాంటి ఆప్షన్లే వస్తాయి. వాటి సహాయంతో ఫోన్‌సు సులభంగా ఎక్కడుందో కనిపెట్టవచ్చు. లేదా రిమోట్‌గా లాక్ చేయవచ్చు. డేటాను ఎరేజ్ చేయవచ్చు. ఐఎంఈఐ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అలాగే ఫోన్‌లో 5 నిమిషాల పాటు సౌండ్ వచ్చేలా చేయవచ్చు. ఇలా పోయిన ఆండ్రాయిడ్, ఐఫోన్లను వెదకవచ్చు.
COMMENTS