Jobs in the railways for 8th Class, Inter, and ITI graduates.
Railway Recruitment ఎనిమిదో తరగతి , ఇంటర్ , ITI అర్హతతో రైల్వే లో ఉద్యోగాలు.
8వ తరగతి పాసైన వారికి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీదే. పాటియాలా లోకోమోటివ్ వర్క్స్, పాటియాలా 295 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాటియాలా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కింద పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ కి ఎలాంటి అర్హతలు కావాలో నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వెల్లడించింది. మరింకెందుకు ఆలస్యం ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుని వెంటనే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగలరు.
మొత్తం ఖాళీలు: 295
ట్రేడ్ ల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రీషియన్: 140
(ఎస్సీ 21 + ఎస్టీ 11 + ఓబీసీ 38 + యుఆర్ 70) & (పీడబ్ల్యూడీ 04, ఎక్స్ సర్వీస్ మెన్ 04)
మెకానిక్ (డీజిల్): 40
(ఎస్సీ 06 + ఎస్టీ 03 + ఓబీసీ 11 + యుఆర్ 20 & (పీడబ్ల్యూడీ 01, ఎక్స్ సర్వీస్ మెన్ 01)మెషినిస్ట్: 15 (ఎస్సీ 02 + ఎస్టీ 01 + ఓబీసీ 04 + యుఆర్ 08) ఫిట్టర్: 75 (ఎస్సీ 11 + ఎస్టీ 06 + ఓబీసీ 20 + యుఆర్ 38) & (పీడబ్ల్యూడీ 02, ఎక్స్ సర్వీస్ మెన్ 02)వెల్డర్ (జి & ఈ): 25 (ఎస్సీ 04 + ఎస్టీ 02 + ఓబీసీ 07 + యుఆర్ 12) & (పీడబ్ల్యూడీ 01, ఎక్స్ సర్వీస్ మెన్ 01
అర్హతలు:
ఎలక్ట్రీషియన్ పోస్టుకి:
10వ తరగతి మరియు ఇంటర్ లో (సైన్స్, మ్యాథ్స్) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
మెకానిక్ (డీజిల్) పోస్టుకి:
10వ తరగతి మరియు ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
మెకానిక్ (డీజిల్) ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
మెషినిస్ట్:
10వ తరగతి మరియు ఇంటర్ లో (సైన్స్, మ్యాథ్స్) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
మెషినిస్ట్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
ఫిట్టర్:
10వ తరగతి మరియు ఇంటర్ లో (సైన్స్, మ్యాథ్స్) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిట్టర్ ట్రేడ్ ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
వెల్డర్ (జి & ఈ):
8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వెల్డర్(జి & ఈ) ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు పరిమితి:
వెల్డర్ పోస్టుకి:
అక్టోబర్ 31 2022 నాటికి 15 నుంచి 22 ఏళ్లు
ఇతర పోస్టులకి:
అక్టోబర్ 31 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్లు
అభ్యర్థుల ఎంపిక:
అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్:
ప్రథమ సంవత్సరం ట్రైనింగ్ లో: రూ. 7,000/-
ద్వితీయ సంవత్సరం ట్రైనింగ్ లో: రూ. 7,700/-
తృతీయ సంవత్సరం ట్రైనింగ్ లో: రూ. 8,050/-
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
దరఖాస్తు చివరి తేదీ: 16.11.2022
WEBSITE : https://plw.indianrailways.gov.in/works/index.jsp
FOR APPLICATION CLICK HERE
FOR REGISTRATION CLICK HERE
FOR NOTIFICATION CLICK HERE
COMMENTS