ITBP RECRUITMENT 2022
287 కానిస్టేబుల్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం.. పదో తరగతి పాసైతే చాలు..
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి అద్భుత అవకాశం. న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ తాజాగా 287 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ (గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వీటిల్లో కానిస్టేబుల్ (టైలర్, గార్డెనర్, కోబ్లర్) పోస్టులు 65, కానిస్టేబుల్ (సఫాయి కరంచారీ, వాషర్‌మన్, బార్బర్) పోస్టులు 222 వరకు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది.
ఆసక్తి కలిగిన పురుష /మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నవంబర్ 30, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్ 23వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
డిసెంబర్ 22, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికై వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS