IIITDM KURNOOL JOBS 2022
కర్నూలు జిల్లాలోని ట్రిపుల్ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో టీచింగ్ ఉద్యోగాలు.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్.. 27 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మ్యాథ్స్/ఫిజిక్స్ స్ట్రీమ్స్‌లలో మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ సైన్సెస్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 9, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
జనరల్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
రాత పరీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రతిభకనబరచిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS