Hyderabad Real Estate: The right platform to realize your own dream.. Real Estate Expo in Hyderabad from 18th of this month
Hyderabad Real Estate: మీ సొంతింటి కల సాకారానికి సరైన వేదిక.. హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి రియల్ ఎస్టేట్ ఎక్స్పో
సొంతిల్లు నిర్మించుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకే ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇళ్లు కట్టాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ఇంకేమైనా స్థిరాస్తులు కొనాలన్నా సరైన సమాచారం అవసరం. అలాంటి సమాచారం మీరు తెలుసుకోవాలంటే టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో చక్కని అవకాశం కల్పిస్తోంది. ‘TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్పో’ నవంబర్ 18వ తేదీ నుంచి 20 వతేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ హైటెక్ సిటీలోని హైటెక్స్ లో టీవీ9 నెట్వర్క్ నిర్వహించనుంది. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.
అన్ని వర్గాల ప్రజలకు అనువైన బడ్జెట్లో హౌసింగ్ ఆప్షన్లను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తుంది. ప్లాట్.. విల్లా.. ఫామ్ ల్యాండ్, ప్రాపర్టీ ఏదైనా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా అవసరమైన సమాచారం పొందే సరైన గొప్ప వేదిక టీవీ9 స్వీట్‌హోమ్. ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, ఫామ్‌హౌస్, కమర్షియల్ ప్రాపర్టీలు, రెసిడెన్షియల్ ప్రాపర్టీలతో సహా ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి సరైన గొప్ప వేదిక ఇది. ఫర్నీచర్, ఇంటిరీయర్ డిజైనింగ్, వాటర్ ఫౌంటెన్, వాల్ ఆర్ట్ డెకరేషన్, ఇంకా మరెన్నో గృహలంకరణ డిజైన్లు, వస్తువుల గురించి సమగ్ర సమాచారాన్ని ఈ ఎక్స్‌పోలో తెలుసుకోవచ్చు.
దీంతో పాటు వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్ల వివరాలు, అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించే బ్యాంకుల గురించి అవసరమైన సమాచారం ఈ ఎక్స్ పోలో పొందొచ్చు. తమ బడ్జెట్లో అనేక రకాల సౌకర్యాలతో కూడిన సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి.
అపర్ణ, మైహోమ్ గ్రూప్, సుచిరిండియా, కిసాన్ పరివార్, ఐరా, సుహాస్ ప్రాజెక్ట్స్ సహా మరెన్నో ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ఎక్స్ పోలో పాల్గొంటాయి. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమే.
COMMENTS