Govt jobs in Andhra Pradesh..Notification for filling 1520 attendant jobs..7th standard pass is enough
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలు.. 1520 అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 7వ తరగతి పాసై ఉంటే చాలు
ప్రధానాంశాలు:
- ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ 2022
- జిల్లా కోర్టుల్లో 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
- నవంబర్ 11 దరఖాస్తులకు చివరితేది
AP Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 7వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతోంది. నవంబర్ 11 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాల్లోకెళ్తే..
జిల్లాల వారీగా ఖాళీలు:
అనంతపురం- 92
చిత్తూరు- 168
తూర్పు గోదావరి- 156
గుంటూరు- 147
వైఎస్ఆర్ కడప- 83
కృష్ణా- 204
కర్నూలు- 91
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు- 104
ప్రకాశం- 98
శ్రీకాకుళం- 87
విశాఖపట్నం- 125
విజయనగరం- 57
పశ్చిమ గోదావరి- 108
ముఖ్యసమాచారం:
అర్హత: ఏడో తరగతి పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.20,000 – రూ.61,960.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.800(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 22, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2022.
పూర్తి వివరాలకు వెబ్సైట్:https://hc.ap.nic.in/
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS