Fantastic news for Phone Pay and Google Pay users.
Google Pay- PhonePe: పోన్ పే, గూగుల్ పే వాడేవారికి సూపర్ న్యూస్
Google Pay- PhonePe: పూర్వకాలంలో వస్తు వినిమయ పద్ధతి అమలులో ఉండేది. అప్పుడు వస్తువులను ఒకదానికి బదులు మరొకటి తీసుకునేవారు. దీన్ని వస్తు మారకం అని కూడా అనేవారు.
ప్రస్తుతం పద్ధతులు మారాయి. బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకునే రోజులు పోయాయి. గతంలో డబ్బు కావాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు బ్యాంకు అవసరాలు తగ్గిపోయాయి.
ఏదైనా అత్యవసరం అయినా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డబ్బు మనకు అందుబాటులో ఉండటంతో బ్యాంకు గడప తొక్కాల్సిన అవసరం లేకుండా పోతోంది.
Google Pay- PhonePe
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు యూపీఐ యాప్ ల ద్వారా డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు లేకపోయినా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే లాంటి వాటి ద్వారా డబ్బులు అందజేస్తున్నాయి.
దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతుల్లోనే నగదు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు ఏర్పాట్లు చేశాయి. దీంతో ప్రజలకు ఎలాంటి కష్టాలు రావడం లేదు.
ప్రస్తుతం బ్యాంకులు ఏటీఎంల స్క్కీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేస్తే యూపీఐ పిన్ ఎంటర్ చేసి రూ.5 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. దీంతో డబ్బు తీసుకోవడం సులభంగా మారుతుంది. కాలం మరుతున్న కొద్దీ సదుపాయాల కల్పనలో బ్యాంకులు మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో ప్రజలకు మరిన్ని సేవలు సౌకర్యవంతంగా మారుతున్నాయి. భవిష్యత్ లో మరిన్ని మార్పులు రానున్నాయి.
2016లో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేయడంతో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంతో సమయం వేచి చూసేవారు. డబ్బు తీసుకోవడానికి ఎన్నో తిప్పలు పడేవారు. కాలం మారింది.
బ్యాంకుల ఆలోచనలతో కొత్త పథకాలు వినియోగంలోకి వచ్చి మరింత అనుకూలంగా డబ్బు చేతుల్లోకి వచ్చే విధంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఈనేపథ్యంలో డబ్బు విత్ డ్రాలు ఇక మీదట ఇంకా సులభంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
COMMENTS