Even at the age of 71, Narayana Bhatt from Shirisi in Uttara Kannada district achieved state first rank in diploma.
71 ఏళ్ల వయసులోను డిప్లొమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసికి చెందిన నారాయణ భట్ గారు.
చదువుకు వయస్సుతో సంబంధం లేదన్నది అక్కడ అక్షరాలా నిజమైంది. కష్టించి పని చేసే వారికి రెట్టింపు ఫలితం లభిస్తుందన్నది అతడి జీవితంలో తూచా తప్పకుండా రుజువైంది.
వృద్ధాప్యంలో కృష్ణా.. రామా.. అంటూ ఓ మూల కూర్చోకుండా లక్ష్యం పై దృష్టి పెట్టి అనుకున్నది సాధించి.. చదువుల తల్లిని మెప్పించి విజయలక్ష్మిని వరించాడు ఓ 71 ఏళ్ల నవ-యువకుడు.
ధైర్యే సాహసే సరస్వతే అంటూ71ఏళ్ల వయస్సులో తాను అనుకున్న లక్ష్యాన్ని శోధించి సాధించాడు కర్ణాటకకు చెందిన నారాయణ భట్. అనుకున్నది సాధించకపోతే జీవితంలో కిక్కు ఉండదనుకున్నాడో ఏమో.. వెంటనే తనకు నచ్చిన సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరి రాష్ట్ర మొదటి ర్యాంకు కొల్లగొట్టాడు.
ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసికి చెందిన నారాయణ భట్ 1973లో ప్రభుత్వ పాలీటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పుడు కూడా ఆ కోర్సులో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అతడిని కొలువు వెతుక్కుంటూ వచ్చింది. ఉద్యోగరీత్యా గుజరాత్ వెళ్లిన అతడు.. 2013లో పదవీవిరమణ పొంది, తిరిగి కర్ణాటకకు వచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన భవననర్మాణాలపై దృష్టి పెట్టాలనుకున్నాడు. భవనాల నిర్మాణం చేపట్టాలంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఇతరుల సర్టిఫికెట్లు కావాలనీ.. అది తనకు ఇష్టం లేనందున.. తన పేరు మీదే సర్టిఫికేట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేయాలని భావించిన నారాయణ భట్ దరఖాస్తుల సమయంలో సివిల్ ఇంజినీరింగ్ కోర్సు ఎంపిక చేసుకుని స్థానిక కళాశాలలో చోటు సంపాదించుకున్నాడు. విద్యార్థిగా నారాయణ భట్ ఒక్క రోజు కూడా తరగతులకు హాజరు కాకుండా లేరని, ఒక్క అనారోగ్య లీవ్ కూడా లేదని.. కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. యూనిఫాం లేకుండా నారాయణ భట్ ఎప్పుడూ కళాశాలకు రాలేదని చెప్పారు. 71 ఏళ్ల వయసులోనూ తన తోటి విద్యార్థులతో కలివిడిగా, ఉల్లాసంగా ఉండేవారని వెల్లడించారు. అలా మొదటి ఏడాదిలో 91శాతం ఉత్తీర్ణతను సాధించిన భట్ ఇటీవల వెల్లడైన ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నవంబర్ 2న ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నేపథ్యంలో భట్.. సీఎం బసవరాజ్ బొమ్మై చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకోనున్నాడు.
'1973లో కార్వార్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ డిప్లొమాలో చదివి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాను. ఆ తరవాత గుజరాత్‌లో ఓ పరిశ్రమలో పనిచేసి.. 2013లో పదవీ విరమణ పొందాను. నా రిటైర్డ్ జీవితాన్ని గడపడానికి శిరిసికి వచ్చాను. నాకు సివిల్ నిర్మాణం గురించి అవగాహన ఉంది. అందుకే రిటైర్‌మెంట్ తరవాత నిర్మాణాన్ని ప్రారంభించాను. అయితే దానికి సర్టిఫికేట్ అవసరం. కాబట్టి సమయాన్ని వృథా చేయకుండా.. వెంటనే సివిల్ ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుని అడ్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది'
నారాయణ్ భట్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్
COMMENTS