Does our home possess divine power? Or.? Want to know
మన ఇంట్లో దైవశక్తి ఉందా.? లేదా.? తెలుసుకోవడం ఎలా.
మన ఇంట్లో దైవ శక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా, ఒకవేళ మన ఇంట్లో దైవ శక్తి ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత, మన ఇంట్లో ఉన్న దైవ శక్తిని పెంపొందించుకోవడానికి మనం ఏమేమి చేయాలి.
అలా చేయడం వల్ల దైవ శక్తి ఎలా పెరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా దీపారాధన అనేది చాలా ముఖ్యం.
హైందవ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయడం అనేది అలవాటుగా ఉండేది. అంతేకాకుండా దీపారాధనకు మాత్రమే కాకుండా, ఇంట్లో కూడా దీపాలని వెలిగించుకునేవారు మన పాత రోజుల్లో అయితే. కరెంటు వచ్చాక లైట్లు వచ్చాక దీపారాధన కేవలం భగవంతుడు దగ్గర మాత్రమే చేస్తున్నారు తప్ప, ఇక దీపాలని వెలిగించడం లేదు. ఆ అవసరం పడట్లేదు. చుట్టూ మన ఎన్విరాన్మెంటు ఉన్నటువంటి మంచి గాలిని శాసిస్తూ అదేవిధంగా దీపపు కాంతిలో, దీపంలో మనం నువ్వుల నూనెను లేదంటే నేతి దీపాలను ఇలా పెడుతూ ఉంటాం. ఆ దీపం నుండి వచ్చేటటువంటి ఆ పొగ వల్ల కూడా మనకు ఆరోగ్యం వస్తూ ఉండేది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో బిల్డ్ అవుతూ ఉండేది.
మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడు దగ్గర మాత్రమే పరిమితమైంది. అది కూడా ఆ వెలిగిన కాసేపే, దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడంలేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మనం పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు కారణం ఏంటంటే అందులో మనం వేసేటటువంటి నూనె లేదా, నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అనేది వెదజల్లే స్మెల్ ఏదైతే ఉంటుందో, దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లో ఫీల్ అవుతూ ఉంటుంది.. తద్వారా దైవ శక్తి అనేది పెంపొందిస్తూ ఉంటుంది, మనం దైవ శక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆత్ర పడుతూనే ఉంటాం. కారణం ఏమిటి అంటే దైవ శక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో, అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గిపోతాయి.
సంధ్య దీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది చక్కగా ఇంట్లో వెదజల్లుతూ ఉండాలి. సాయం సంధ్యా సమయంలో కొంతమంది కచ్చితంగా దీపాలు పెడుతూ ఉంటారు, అలా పెట్టేటటువంటి దీపాల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో, ఆ ఇంట లక్ష్మీదేవి కాలేడుతుంది. ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపించినప్పుడు కూడా, మనం కచ్చితంగా చేయవలసింది ఏంటంటే దీపారాధన.
దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి, నువ్వుల నూనె వేసి దీపం వెలిగిస్తే అలా వెలుగుతూ ఉన్నప్పుడు, ఒక రెండు లవంగాలను వేయాలి. అది లవంగ దీపం అవుతుంది, అలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫీల్ ఆవుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది, తద్వారా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది, కుబేర స్థానం బలపడుతుంది. ఇలా జరగడం వల్ల మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక దైవ శక్తి ఉందా లేదా అనే విషయం కూడా అప్పుడు మనకు అర్థమవుతుంది.
COMMENTS