CCRH RECRUITMENT 2022
నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
సీసీఆర్‌హెచ్- నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎంహెచ్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. కేరళలోని కొట్టాయంలో ఉన్న ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ప్రొఫెసర్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ (01), ప్రొఫెసర్ (సైకియాట్రీ) (02), అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) (01), కన్సల్టెంట్ (సైకియాట్రీ) (01), పాథాలజిస్ట్ (01), క్లినికల్ సైకాలజిస్ట్ (01), ఆక్యుపేషనల్ థెరపిస్ట్ (01), సైకియాట్రిక్ సోషల్ వర్కర్ (01), థెరపీ అసిస్టెంట్ (ఆక్యుపేషనల్) (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎండీ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను ది ఆఫీసర్ ఇన్‌ఛార్జి, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంహెచ్, సచివోత్తమపురం, కొట్టాయం, కేరళ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరీ తేదీగా 30-11-2022ని నిర్ణయించారు.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
Post a Comment