Atal Pension Yojana | Monthly investment of Rs. 210. Rs. 60,000 in pension annually!
Atal Pension Yojana : నెలకు రూ.210 పెట్టుబడి.. ఏటా రూ.60వేల పెన్షన్ !
Atal Pension Yojana : ఏ వేతన జీవికైనా ఫుష్కలంగా రిటైర్మెంట్ కార్పస్ ఫండ్ ఉండాలనే కోరిక ఉంటుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కంట్రీబ్యూషన్ చేస్తుంటారు.
ఇక అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం రిటైర్మెంట్ స్కీం ప్రారంభించింది. 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అనే పథకాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ స్కీంలో దాదాపు నాలుగు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) ద్వారా ఈ పథకాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. రిటైర్మెంట్ నాటికి గ్యారంటీ రిటర్న్స్ హామీ ఉంటుంది.
సదరు అసంఘటిత కార్మికుడు భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఏపీవైలో చేరడానికి 18-40 ఏండ్ల మధ్య వయస్కుడై ఉండటంతోపాటు ఒక బ్యాంకులో ఖాతా తెరవాలి.
60 ఏండ్ల వయస్సు తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్లు లభిస్తాయి.
ఈ పథకంలో చేరిన వారికి మరణించే వరకు పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకంలో చేరిన వారు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మరణించే వరకూ పెన్షన్ పొందొచ్చు.
ఈ పథకంలో రోజూ రూ.7 పెట్టుబడిగా పెడితే రూ.60 వేల పెన్షన్ లభిస్తుంది.
18 ఏండ్ల వయస్సు నుంచే అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి ప్రారంభించాలి. నాటి నుంచి 42 ఏండ్ల పాటు ప్రతి నెలా రూ.210 చెల్లిస్తే రిటైర్మెంట్ తేదీ నాటికి నెలకు రూ.5000 పెన్షన్ లభిస్తుంది.
ఏడాదిలో రూ.60 వేల పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో సభ్యులుగా చేరాక ప్రతి నెలా ప్రీమియం రూ.210 తప్పనిసరిగా చెల్లిస్తూనే ఉండాలి.
అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి ఏం చేయాలంటే..
- ఏపీవై అధికారిక వెబ్‌సైట్ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html websiteకు వెళ్లాలి.
- మీ వ్యక్తిగత, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి
- ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చేస్తే ఓటీపీ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
- అటుపై బ్యాంక్ ఖాతా వివరాలు _ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేయాలి.
- ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతా యాక్టివేట్ అవుతుంది.
- నామినీ వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రీమియం పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- ఈ-సైన్ చేస్తే అటల్ పెన్షన్ యోజనలో మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.
COMMENTS