Are you aware of what to do with the remaining pooja Materials? Need to know
మిగిలిన పూజా సామాగ్రిని ఏం చేయాలో తెలుసా.? తప్పక తెలుసుకోగలరు.
ప్రజలు ప్రతిరోజూ భగవంతుడిని పూజిస్తారు. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో దేవుడి పూజకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అక్షత, పండు, పువ్వు, కొబ్బరి, పసుపు, కుంకుమతో సహా అనేక వస్తువులను భగవంతుని పూజకు ఉపయోగిస్తారు.
పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. భగవంతుని పూజించడానికి పూజా సామాగ్రి అవసరం. ఇవన్నీ ఉపయోగించకుండా పూజ చేస్తే అది అసంపూర్ణంగానే చెప్పబడుతుంది. అయితే, ప్రతిరోజు మనం పూజిస్తాం. అందుకు కావాల్సిన పూజా సామాగ్రిని వినియోగిస్తాం. కానీ హోమం లేదా ప్రత్యేక పూజ, పండుగ కోసం కొన్ని వస్తువులను ప్రత్యేకించి తీసుకువస్తారు.. సాధారణంగా పూజ తర్వాత పూజ సామగ్రిలో దాదాపు కొంచం కొంచం మిగిలే ఉంటుంది. ఈ పూజా సామాగ్రిని ఏం చేయాలో చాలామందికి తెలియదు. పూజానంతరం మిగిలిన పదార్థాలను కొందరు ఆలయానికి ఇస్తారు. ఇంకొందరు ప్రవహించే నీటిలో కలిపేస్తారు. మిగిలిన పూజా సామాగ్రిని నీటిలో వదలాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. జీవితంలో ఆనందం,శ్రేయస్సు తీసుకురావడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. మిగిలిన పూజా సామాగ్రిని ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
మిగిలిన పూజా సామగ్రిని ఈ క్రింది విధంగా ఉపయోగించండి
మిగిలిన కుంకుమ:
పూజ కోసం తప్పనిసరిగా కుంకుమను తీసుకువస్తారు. అయితే, ఇంట్లోని వివాహిత స్త్రీలు పూజానంతరం మిగిలిన ఈ కుంకుమను ఉపయోగించవచ్చు. స్త్రీలు ఈ కుంకుమ ధరిస్తే శుభం కలుగుతుంది. మీరు ఇంటికి తెచ్చిన ఏదైనా కొత్త వస్తువును పూజించడానికి ఈ కుంకుమనే ఉపయోగించవచ్చు. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది.
పూలను ఇలా వాడాలి:
పూజకు పూలు తెస్తారు. పూజలో ఉపయోగించగా కొన్ని పువ్వులు మిగిలి పోతుంటాయి. వాటిని అక్కడక్కడ పడేయకండి. పూజలో మిగిలిన పూలను విసిరేయడం అశుభం. పూజలో మిగిలిన పువ్వులను మాలకట్టిఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఈ పువ్వులు పూర్తిగా ఆరిన తర్వాత వాటిని ఒక కంటైనర్‌లో ఉంచాలి. అప్పుడు దానిని ఎరువుగా ఉపయోగించవచ్చు.
అక్షితలు:
పూజలో అక్షితలు ఉపయోగించబడుతుంటాయి.. అన్నంలో పసుపు, కుంకుమ కలిపితే అక్షతే సిద్ధిస్తుంది. పూజ పూర్తయ్యాక పళ్లెంలో అక్షత వదిలేస్తే చెత్తకుప్పల్లో వేయకూడదు. రోజూ వాడే గోధుమలు లేదా బియ్యంతో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉంటుందని నమ్మకం.
తమలపాకులు:
హిందూ పూజల్లో తమలపాకుకు ప్రాధాన్యత ఉంటుంది. పూజలో తమలపాకు లేకపోతే అది పూజ కాదు. పూజ సమయంలో తమలపాకుపై తాంబూలాన్ని ఉంచుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకును విసిరేయకూడదు. పూజ పూర్తయిన తర్వాత తమలపాకును ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బు అల్మారా లోపల ఉంచాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధించవు.
COMMENTS