AP POLICE RECRUITMENT 2022
ఆంధ్రప్రదేశ్‌లో 6,511 ఎస్‌ఐ/కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోలీసు నియమకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్‌పీ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌తోపాటు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి నిబంధనలకు మేరకు ఉండాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఎస్సై పోస్టులకు జనవరి 18, 2023వ తేదీలోపు, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.150లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది.
ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
ఖాళీల వివరాలు..
ఎస్‌ఐ పోస్టులు: 315
రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 96
కానిస్టేబుల్ (సివిల్) పోస్టులు: 3,580
ఏపీఎస్పీ పోస్టులు: 2,520
రాత పరీక్ష విధానం
ప్రిలిమినరీ రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. అర్థమెటిక్, రీజనింగ్/ మెంటల్‌ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇలా..
సివిల్ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు రన్నింగ్/ లాంగ్‌జంప్ ఈవెంట్లు
ఏపీఎస్‌సీ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు రన్నింగ్/ లాంగ్‌జంప్ ఈవెంట్లు
సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు రన్నింగ్/ లాంగ్‌జంప్ ఈవెంట్లు
ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు రన్నింగ్/ లాంగ్‌జంప్ ఈవెంట్లు
ముఖ్యమైన తేదీలు..
ఎస్సై పోస్టులకు..
ఎస్సై పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: డిసెంబర్ 14, 2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 18, 2023.
ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లు డౌన్‌లోడ్: ఫిబ్రవరి 5, 2023.
ప్రిలిమినరీ రాత పరీక్ష తేది: ఫిబ్రవరి 19, 2023.
కానిస్టేబుల్ పోస్టులకు..
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: నవంబర్ 30, 2022.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28, 2022.
ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లు డౌన్‌లోడ్: జవనరి 9, 2023.
ప్రిలిమినరీ రాత పరీక్ష తేది: జవనరి 22, 2023.
Important Links:
FOR NOTIFICATION & APPLICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS