AIIMS BHOPAL RECRUITMENT 2022
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 125 ఉద్యోగాలు..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన 125 సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎండీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్ 30, 2022వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు.
జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1200లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
AIIMS Bhopal-462020 (MP).
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR DETAILS OF VACANCIES CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR APPLY ONLINE CLICKHERE
COMMENTS