VSSC Recruitment 2022: 273 Graduate Apprentice vacancies in Vikram Sarabhai Space Centre.. These qualifications are enough..
VSSC Recruitment 2022: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 273 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..
భారత ప్రభుత్వ స్పేస్ మంత్రిత్వ శాఖకు చెందిన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్.. 273 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, 60 శాతం మార్కులతో హోటల్ మేనేజ్మెంట్/కేటరింగ్ టెక్నాలజీ డిగ్రీ, 60 శాతం మార్కులతో ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్/కంప్యూటర్ అప్లికేషన్ స్పెషలైజేషన్‌లో బీకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు అక్టోబర్ 30, 2022వ తేదీ నాటికి 30 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు అక్టోబర్ 15, 2022వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.9000లు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ఎయిరోనాటికల్/ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ ఖాళీలు: 15
కెమికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 10
సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 12
కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్ ఖాళీలు: 20
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 12
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఖాళీలు: 43
మెకానికల్ ఇంజనీరింగ్ ఖాళీలు: 45
మెటలర్జీ ఖాళీలు: 6
ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఖాళీలు: 4
ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఖాళీలు: 2
హోటల్ మేనేజ్మెంట్/కేటరింగ్ టెక్నాలజీ ఖాళీలు: 4
బీకాం(ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్) ఖాళీలు: 25
బీకాం (కంప్యూటర్ అప్లికేషన్) ఖాళీలు: 75
అడ్రస్:
Govt Polytechnic College,
Kalamassery, Ernakulam District, Kerala.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS