Technology: Do you forget passwords every time.. but know this..!!
టెక్నాలజీ: ప్రతిసారి పాస్ వర్డ్‌లు మర్చిపోతూ ఉంటారా.. అయితే ఇలా తెలుసుకోండి..!!
నేటి సమాజంలో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వినియోగం పెరిగే కొద్దీ.. అన్ని లావాదేవీలకు పాస్‌వర్డ్‌లు కీలకంగా మారాయి. జీమెయిల్ నుంచి ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు వరకు... ఒక మనిషి ఎన్నో ఎకౌంట్లు, పాస్‌వర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఒకటో రెండో పాస్‌వర్డ్‌లు వినియోగంలో ఉంటే సరిపోయేది. అవసరాలను బట్టి ఇప్పుడు కనీసం పది పాస్‌వర్డ్‌లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మంది పాస్ వర్డ్ ల విషయంలో అయోమయంలో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే.. లెక్కకు మించిన అకౌంట్లు, వాటి పాస్ వర్డ్ లు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టమే.
కానీ, పాస్ వర్డ్‌లు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి.
తరచూ మారుస్తుండాలి. అదే సమయంలో ఒకవేళ మరిచిపోయినా రికవరీ చేయడం తెలుసుకోవాలి. అయితే వివిధ ఖాతాలకు వివిధ పాస్ వర్డ్ లు పెట్టుకునే వారు పాస్ వర్డ్ లు మర్చిపోతే పొందడానికి ఒక మార్గం ఉంది. సాధారణంగా చాలా మంది ఫోన్ లో యాప్స్ లోకి లాగిన్ అయినప్పుడు పైన సేవ్ పాస్ వర్డ్ అని వస్తే యస్ కొట్టేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీ పాస్ వర్డ్ లు అన్నీ గూగుల్ గుర్తుపెట్టుకుంది. మరి మీరు మర్చిపోయిన పాస్ వర్డ్ ఎలా తెలుసుకోవాలి..? అన్నది ఇప్పుడ చూద్దాం.
అందుకు ముందుగా.. మీ గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అయి ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. అందులో https://passwords.google.com లింక్ ను ఓపెన్ చేయాలి. అక్కడ మీరు ఏయే అకౌంట్స్ లోకి లాగిన్ అయ్యారో మొత్తం లిస్ట్ కనిపిస్తుంది. మీకు ఏ పాస్ వర్డ్ కావాలో దాని మీద క్లిక్ చేస్తే, మీరు ఫోన్ లో బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఉంటే మీ ఫింగర్ ప్రింట్ ని, డెస్క్ ట్యాప్ లేదా ల్యాప్ టాప్ లో ఓపెన్ చేసి ఉంటే మీ జీమెయిల్ పాస్ వర్డ్ ని మీ వ్యక్తిగత ధ్రువీకరణ కోసం అడుగుతుంది. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి కాగానే.. ఆ పాస్ వర్డ్ మీకు కనిపిస్తుంది.
COMMENTS