SBI ATM PIN: Forgot SBI ATM PIN? Generate it with a single phone call
SBI ATM PIN: ఎస్బీఐ ఏటీఎం పిన్ మర్చిపోయారా? ఒక్క ఫోన్ కాల్తో జనరేట్ చేయండి ఇలా..
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్బీఐ ఏటీఎం కార్డు వాడుతున్నారా? లేదా కొత్తగా ఏటీఎం కార్డు తీసుకున్నారా? మరి ఏటీఎం పిన్ ఎలా జనరేట్ చేయాలో తెలుసా? గతంలో ఏటీఎం పిన్ పోస్టులో వచ్చేది. ఒకవేళ పిన్ మర్చిపోతే మళ్లీ బ్యాంకుకు వెళ్లి సెట్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో సులువుగా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లు IVRS నెంబర్కు కాల్ చేసి తమ ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు. ఇంటరాక్టీవ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్-IVRS ద్వారా డెబిట్ కార్డ్ పిన్ లేదా గ్రీన్ పిన్ జనరేట్ చేసే అవకాశం కల్పిస్తంది ఎస్బీఐ.
ఇందుకోసం ఎస్బీఐ కస్టమర్లు 1800 112 211 లేదా 1800 425 3800 నెంబర్లకు కాల్ చేసి అందులోని ఆప్షన్స్ ఎంచుకోవడం ద్వారా తమ పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు.
ముందుగా కస్టమర్ల దగ్గర ఏటీఎం కార్డు నెంబర్, అకౌంట్ నెంబర్ సిద్ధంగా ఉండాలి. బ్యాంకులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇతర నెంబర్ల నుంచి కాల్ చేస్తే పిన్ జనరేట్ కాదు. అన్నీ సిద్ధంగా ఉంచుకున్న తర్వాత 1800 112 211 లేదా 1800 425 3800 నెంబర్కు కాల్ చేయాలి. భాషను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ సర్వీసెస్ కోసం 2 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పిన్ జనరేషన్ కోసం 1 ప్రెస్ చేయాలి.
ఆ తర్వాత 2 ప్రెస్ చేసి ఏటీఎం కార్డులోని 16 లేదా 19 అంకెల్ని ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత 11 అంకెల అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఎస్బీఐ డెబిట్ కార్డ్ పిన్ జనరేట్ అవుతుంది. ఒకవేళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కాకుండా ఇతర నెంబర్ల నుంచి కాల్ చేస్తే కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడి పిన్ జనరేట్ చేసేందుకు సాయం తీసుకోవచ్చు. ఐవీఆర్ఎస్ ద్వారా మాత్రమే కాదు వేర్వేరు పద్ధతుల్లో కూడా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు. ఏటీఎం సెంటర్లో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు.
COMMENTS