Rail users can benefit from useful apps
ప్రయాణికుల సేవలో రైల్వే యాప్స్.
రైలు ప్రయాణం ఆహ్లాదకరంగా . . సుఖవంతంగా సాగేందుకు వివిధ రైల్వే యాప్స్ ప్రయాణికులకు ఎంత గానో ఉపయోగపడుతున్నాయి . అరచేతిలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటే చాలు . . క్షణాల్లో కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు . రిజర్వేషన్ , సాధారణ టిక్కెట్లను సైతం బుకింగ్ చేసుకోవచ్చు . రైలులో ఆహ్లాదకరంగా గడి పేందుకు , తోటి ప్రయాణికులతో మాట్లాడేందుకు యాప్‌లు తోడుగా ఉంటున్నాయి .
రైల్వే యాప్స్ ప్రయాణి కులకు ఎంతో సమయాన్ని ఆదా చేయడం తోపాటు ప్రయోజనకారిగా ఉంటున్నాయి , సాధారణ ప్రయాణికులు గంటల కొద్దీ క్యూలో వేచి ఉండకుండా సత్వరమే మొబైల్ ద్వారా టిక్కెట్ కొనుగోలుకు యూటీఎస్ ఆనే మొబైల్ యాషీను రూపొందించారు . దీని ద్వారా సాధా రణ టిక్కెట్ సులభంగా కొనుగోలు చేయ వచ్చు . దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుంది . గతంలో రిజర్వే షన్ టిక్కెట్లకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది . వివిధ రైల్వే యాప్‌లు , వాటి ప్రయో జనాలను రైల్వే అధికారులు ఇలా వివరించారు .
కోచ్ మిత్ర యాప్ . .
ప్రయాణికులు తాము ప్రయాణిస్తున్న బోగీలో ఏమైనా అసౌకర్యం కలిగినా , పారిశుద్ధ్యానికి సంబంధించిన లోపాలు తలెత్తినా , నీటి సర ఫరాకు సంబంధించినా , విద్యుత్‌లో లోపాలు తలెత్తినా , ఏసీ పనిచేయకపోయినా ఈ యాప్ ద్వారా తమ టిక్కెట్ , పీఎన్ఆర్ నంబరు నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు . సత్వరమే సేవలు పొందవచ్చు .
వేరీజ్ మై ట్రైన్ యాప్ . .
పీఎన్ఆర్ స్టేటస్ ట్రైన్ నంబరు నమోదు చేసి ప్రయాణికులు తాము ఎక్కాల్సిన రైలు ఎక్కడుందో తెలుసుకోవడానికి వేరీజ్ మై ట్రైన్ యాప్ ఉపయోగపడుతుంది . దీనివల్ల ప్రయా ణికులు తాము ఎక్కాల్సిన రైలు , ఏ సమయా నికి స్టేషన్ కు వస్తుందో తెలుసుకోవచ్చు . అలాగే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తమ టిక్కెట్ కస్పర్మ్ అయిందా లేదా , ఏ బెర్త్ లో బోగి కేటాయిచారు ? తదితర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు .
రైల్ గురు యాప్ . .
దేశంలో వివిధ రైళ్ల టైం టేబుల్‌కు సంబంధిం చిన వివరాలు రైలు గురు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు .
.రైల్ సాధి యాప్ .
ప్రయాణికులకు వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్కడఏ సౌకర్యాలు ఉన్నాయో ఈ రైలు సాధి యాప్ ద్వారా తెలుసుకోవచ్చు .
ఐ.ఆర్.సి.టి. సి ట్రైనింగ్ బుకింగ్ యాప్ . .
ఐఆర్ సిటీసీ యాప్ ద్వారా రిజర్వేషన్ ప్రయాణి కులు తాము ఎక్కాల్సిన ట్రైన్ద సంబంధించిన టిక్కెట్లను ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయ వచ్చు . దేశ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా స్లీపర్ , ఏసీ , సెకండ్ ఏసీ తరగతులకు రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు . ప్రయాణికులు తాము కూర్చొన్న సీటు వద్దకే తమకు నచ్చిన ఆహారాన్ని ఈ కేటగిరి యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు . రైలు గమ్య స్థానానికి చేరే రెండు గంటల ముందు ఈ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది . నగదును ఆన్లైన్ ద్వారాగానీ , తమవద్దకు ఆహారాన్ని తీసుకొచ్చే వ్యక్తికి చెల్లించ వచ్చు .
మొబైల్‌తో రిజర్వేషన్ ఈజీ . .
మొబైల్ ద్వారా ఇంటి వద్దనుంచిగానీ , ఇంటర్నె ట్లో గానీ , రైల్వే యాప్‌లోగానీ , బుకింగ్ ఏజెంట్ల వద్దగాని తమ టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకోవచ్చు . పేటీఎం , ఫోన్ పే , ఐఆర్ సీటీసీ , మేక్ మైట్రిప్స్ , క్లియర్ టిప్స్ ద్వారా రైల్వేస్టేషన్ రిజర్వేషన్ టిక్కెట్లను పొందవచ్చు . రైల్వే రిజర్వేషన్ కేంద్రాల వద్ద కూడా రిజర్వేషన్ టిక్కెట్లు పొందవచ్చు . ఈ కౌంటర్లు సాధారణం గా ఉదయం 8 . 00 నుంచి రాత్రి 8 . 00 గంటల వరకు పనిచేస్తాయి .
రైలు మిత్ర యాప్ . . .
రైలు ప్రయాణంలో ఆహ్లాదంగా గడిపేందుకు మిత్రులను ఏర్పాటు చేసుకునేందుకు రైల్ మిత్ర యాప్ ఎంతో ఉపయోగపడుతుంది . ఏఎన్ఆర్ నంబరు నమోదు చేయడం ద్వారా ఆ రైలులోగానీ , బోగీలోగానీ ఈ యాప్ లో నమో దైన వారితో సంభాషించవచ్చు . లేదా దాటింగ్ చేయవచ్చు .
COMMENTS