Post Office Schemes: Investing in these Post Office Schemes is profitable.
Post Office Schemes: పోస్టాఫీసులోని వీటిలో పెట్టుబడి పెడితే అధిరిపోయే లాభాలు.
పోస్టాఫీసు.. అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది తపాలా బట్వాడా. అయితే ఈ మధ్య కాలంలో ఆ వ్యవస్థ మరింది. కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌శాఖను మరింతగా బలోపేతం చేసింది. ఇప్పుడు అదే స్థానంలో బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చింది. ఇందులోనూ వివిధ రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసే స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక పోస్టాఫీసు పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడులు. సాంప్రదాయ పెట్టుబడులను ఇష్టపడే వారికి, దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే వారి కోసం ఈ పథకాలను రూపొందించారు. మీరు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చొని మంచి లాభాలు పొందవచ్చు. ప్రభుత్వం వడ్డీ రేట్లను భారీగా పెంచింది. పోస్టాఫీసులు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), కిసాన్ వికాస్ పత్ర (కెవిపి), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాలలో 2, 3 సంవత్సరాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వబడుతుంది. వారు పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి గొప్ప అవకాశం పొందుతారు. ఇండియా పోస్ట్ పథకాలు ప్రభుత్వ మద్దతుతో నడుస్తాయి. అవి మరింత సురక్షితమైనవి.. అంతే కాకుండా వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్ను సెక్షన్ 80-సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
చిన్న పథకాలపై వడ్డీ అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు, 2021-22 మొదటి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు సవరించబడ్డాయి. అప్పట్లో ప్రభుత్వం ఈ పథకాలపై వడ్డీని తగ్గించింది. ఈసారి వడ్డీరేట్లను పెంచారు. కొత్త రేట్లు 1 అక్టోబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
కేవీపీలో చాలా లాభం ఉంటుంది..
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకంలో మెచ్యూరిటీ వ్యవధి, వడ్డీ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇంతకుముందు ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలుగా ఉండగా.. ఇప్పుడు దానిని 123 నెలలకు తగ్గించారు. వడ్డీ రేటు కూడా మార్చింది. ఇది గతంలో 6.9 శాతం నుంచి ఇప్పుడు 7 శాతానికి పెరిగింది.
చాలా వడ్డీ లభిస్తుంది..
పోస్ట్ ఆఫీస్‌లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద.. ఇప్పుడు మీకు 7.4 శాతానికి బదులుగా 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)కి ఇప్పుడు 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇంతకు ముందు 6.6 శాతంగా ఉంది. 10 బేసిస్ పాయింట్లు పెంచారు.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.
2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) పోస్టాఫీసు వడ్డీని 20 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇప్పుడు వడ్డీ రేటు 5.7 శాతానికి పెరిగింది. అంతకుముందు వీటికి 5.5 శాతం వడ్డీ లభించేది.
పోస్టాఫీస్ 3 సంవత్సరాల ఫిక్సెడ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) 30 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీనిపై వడ్డీ 5.5 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది.
COMMENTS