Post Office Jobs: Notification for Post Office Jobs
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.
పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల (Post Office Jobs) భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ (India Post) నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్కిల్డ్ ఆర్టిసన్ పోస్టులున్నాయి. మొత్తం 5 ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 19 చివరి తేదీ.
కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియా పోస్ట్.
అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.
ఒకటి కన్నా ఎక్కువ పోస్టుకు అప్లై చేస్తే దరఖాస్తు ఫామ్ తిరస్కరిస్తారు.
అప్లికేషన్ ఫామ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్టులో పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు, దరఖాస్తు విధానం, విద్యార్హతల గురించి తెలుసుకోండి.
India Post Recruitment 2022: ఖాళీల వివరాలివే
మొత్తం ఖాళీలు 5
ఎంవీ మెకానిక్ (స్కిల్డ్) 2
ఎంవీ ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్) 1
పెయింటర్ (స్కిల్డ్) 1
టైర్‌మ్యాన్ (స్కిల్డ్) 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 19
విద్యార్హతలు- అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు.
ఎంపిక విధానం- కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్
వేతనం- ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006.
For Notification & Application Clickhere
COMMENTS