New phone - If the phone is lost, it is very difficult to track it - what to do immediately after buying the phone
New phone -ఫోన్ పోతే ట్రాక్ చేయడం చాలా కష్టం - ఫోన్ కొన్న వెంటనే ఏంచేయాలి
ఫోన్ పోతే ట్రాక్ చేయడం చాలా కష్టం ఇండియా వంటి రద్దీ ప్రాంతాల్లో ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, ఆ ఫోన్ ను వెతికి పట్టుకోవటమనేది చాలా కష్టమైన చర్యగా చెప్పుకోవచ్చు. మీ వద్ద ఫోన్ కొనుగోలు బిల్, డివైస్ IMEI నెంబర్ ఉన్నప్పటికి, ఆ ఫోన్ ట్రేస్ అవుతుందన్న గ్యారంటీ అయితే ఉండదు.ఆండ్రాయిడ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్‌లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరచటం వల్ల కొంతలో కొంత ఉపశమనంగా మీ ఫోన్‌లకు సంబంధించి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ ద్వారా ఫోన్‌ను లొకేట్ చేయటమే కాకుండా, ఫోన్‌ను లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫోన్ దొంగతనం చేసిన వారు వెంటనే ఐఎంఈఐ నంబర్లు మార్చివేస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ దొరకడం చాలా కష్టం. IMEI నెంబర్ మార్చే టూల్స్ అందుబాటులోకి రావడంతో ఫోన్ IMEI నెంబర్ ను వెంటనే మార్చి వేస్తున్నారు.అందుకే ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలను తీసుకుంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఫోన్ కొన్న వెంటనే ఏంచేయాలి
ఐఎంఈఐ నెంబర్ ప్రతీ ఫోన్‌కు వేర్వేరుగా ఉంటుంది. అందువల్ల ఫోన్ కొన్న వెంటనే #06#కు డయిల్ చేస్తే ఐఎంఈఐ నెంబర్ తెలుస్తుంది. దీనిని నోట్ చేసి పెట్టుకొని ఫోన్ పోయిన వెంటనే www.bharatiyamobile.com, www.microlmts.net, మొదలైన వెబ్‌సైట్లలో రిజస్టర్ చేసుకుంటే అవి ఫోన్‌ను ట్రాప్ చేసి పెడతాయి. పోయిన ఫోన్ ఎక్కడ ఉందో తెలియజేస్తాయి. ఫోన్ పోయినప్పుడు కంప్లెంట్ చేస్తే ఎఫ్‌ఐఆర్‌లో ఈ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది.
అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ :
ఈ అప్లికేషన్ కూడా మీ ఫోన్‌కు సెక్యూరిటీ గార్డులా ఉంటుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించకుండా కాపాడడంతో పాటు యాప్‌లో సెట్ చేసిన యాంటీ తెఫ్ట్ కాంపోనేట్ ఫోన్ పోయిన వెంటనే దానికి సంబంధించిన ఆచూకీ సమాచారాన్ని అప్‌డేటెడ్‌గా మెసేజ్‌ల రూపంలో అందిస్తుంది.
మొబైల్ ఛేజ్ లొకేషన్ ట్రాకర్ :
ఈ యాప్ మన ఫోన్ పోయిన వెంటనే మొబైల్ కదలికల్ని వెంటనే అందిస్తుంది. సదరు వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా, కొత్త సిమ్ ద్వారా మెసేజ్ చేసినా తక్షణమే ఆ సమాచారాన్ని ఈ యాప్ స్టోర్ చేసుకుంటుంది.
థీఫ్ ట్రాకర్ :
ఈ అప్లికేషన్ సాయంతో మొబైల్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ యాప్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి మీ ఈ-మెయిల్‌కు పంపుతుంది. అయితే ఆ ఫోన్‌కు ఫ్రంట్ కెమెరా కూడా ఉండాలి.
COMMENTS