Job Mela in AP: 200 jobs in 4 organizations
ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు మరో జాబ్ మేళా.. 4 సంస్థల్లో 200 జాబ్స్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18న మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఏపీఎస్ఎస్డీసీ (APSSDC). ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 4 సంస్థల్లో 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 18న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీలు, అర్హతల వివరాలు:
వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సేల్స్ అడ్వైజర్స్, సర్వీస్ అడ్వైజర్స్, అసిస్టెంట్ టెక్నీషియన్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, డ్రైవర్స్, పెయింటర్స్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది.
Apex Advanced Geospatial Pvt Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం ఉంటుంది.
Mohan Spintex India Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. హెల్పర్స్, ఆపరేటర్స్, టెక్నీషియన్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏడో తరగతి నుంచి ఇంటర్/ఐటీఐ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది.
Navata Road Transport: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. క్లర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.9,400 నుంచి రూ.10,300 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తికలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 18న రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (కమ్యూనిటీ హాల్), కురుమద్దలి, పామర్రు మండలం, కృష్ణా జిల్లా చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- అభ్యర్థులు ఇతర వివరాలకు 9966489796, 8074370846 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
COMMENTS