IRCTC Jobs 2022: Apprentice Trainee Vacancies in IRCTC with 10th Class qualification.. Opportunity to get direct job without written exam..
IRCTC Jobs 2022: పదో తరగతి అర్హతతో ఐఆర్సీటీసీలో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలు.. రాత పరీక్షలేకుండా నేరుగా ఉద్యోగం పొందే అవకాశం..
భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన నార్త్ జోన్‌లో.. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలోని 80 అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబందిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 15 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్ 25, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
అర్హత సాధించినవారు ఢిల్లీ జోన్‌లో పనిచేయవల్సి ఉంటుంది. ఏడాది పాటు ట్రైనింగ్ కొనసాగుతుంది. ట్రైనింగ్ ఈ కింది విధంగా స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
స్టైపెండ్ వివరాలు..
5వ తరగతి నుంచి 9వ తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులకు నెలకు రూ.5000
10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్ధులకు నెలకు రూ.6000
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్ధులకు నెలకు రూ.7000
స్టేట్/నేషనల్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్ధులకు నెలకు రూ.7000
టెక్నీషియన్ అప్రెంటిస్/డిప్లొమా అప్రెంటిస్ అభ్యర్ధులకు నెలకు రూ.8000
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/డిగ్రీ అప్రెంటిస్ అభ్యర్ధులకు నెలకు రూ.9000లు స్టైపెండ్ చెల్లిస్తారు.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS